ఒకప్పుడు గోపీచంద్ (Gopichand) కి మంచి మార్కెట్ ఉండేది. గోపీచంద్ నుండి ఓ సినిమా వస్తుందంటే మాస్ ఏరియాల్లో మంచి సందడి వాతావరణం ఏర్పడేది. గోపీచంద్ కూడా ఏడాదికి 2 సినిమాలు చేస్తే అందులో ఒక మాస్ సినిమా ఉండేలా జాగ్రత్త పడేవారు. 2007 కి వెళ్తే..! ఆ ఏడాది ఆరంభంలో ‘ఒక్కడున్నాడు’ అనే సినిమా చేశాడు గోపీచంద్. అది ఆ టైంలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. బాగానే ఆడింది. కానీ అనుకున్న స్థాయిలో కాదు. అయితే తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో ‘లక్ష్యం’ (Lakshyam) అనే సినిమా చేశాడు. అనుష్క (Anushka) ఇందులో హీరోయిన్ కాగా జగపతి బాబు, కళ్యాణి.. కీలక పాత్రలు పోషించారు.
‘లక్ష్మీ’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ‘శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ బ్యానర్ అధినేత నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి) ఈ చిత్రానికి నిర్మాత. 2007 జూలై 5న రిలీజ్ అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 18 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో తెలుసుకుందాం రండి :
నైజాం | 4.95 cr |
సీడెడ్ | 1.47 cr |
ఉత్తరాంధ్ర | 1.54 cr |
ఈస్ట్ | 0.85 cr |
వెస్ట్ | 0.73 cr |
గుంటూరు | 0.88 cr |
కృష్ణా | 0.94 cr |
నెల్లూరు | 0.47 cr |
ఏపీ+తెలంగాణ | 11.83 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 1.92 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 13.75 cr (షేర్) |
‘లక్ష్యం’ రూ.5.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి వారానికే బయ్యర్స్ పెట్టిన మొత్తం వెనక్కి వచ్చేసింది. ఆ ఇక ఫుల్ రన్లో ఈ సినిమా మంచి లాభాలు అందుకుంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.13.75 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.8.35 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.