మంచు విష్ణు (Manchu Vishnu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ (Kannappa) కోసం రూ.200 కోట్ల భారీ బడ్జెట్ పెట్టాడు.ఇది విష్ణు కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. జూన్ 27న రిలీజ్ అయ్యింది. టాక్ డీసెంట్ గానే వచ్చింది. ప్రభాస్ కామియో ఉండటం వల్ల విష్ణు కెరీర్లో భారీ వసూళ్లు నమోదయ్యాయి. వీక్ డేస్ లో తగ్గినా పర్వాలేదు అనిపించాయి. ఈ శుక్రవారం వచ్చిన ‘తమ్ముడు’ ఫ్లాప్ అయినా ‘కన్నప్ప’ (Kannappa) కి బాగానే కలిసొచ్చింది.
దీంతో రెండో శనివారం కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి ‘కన్నప్ప’ (Kannappa) 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 6.96 cr |
సీడెడ్ | 2.29 cr |
ఉత్తరాంధ్ర | 2.21 cr |
ఈస్ట్ | 1.19 cr |
వెస్ట్ | 0.87 cr |
గుంటూరు | 0.97 cr |
కృష్ణా | 0.88 cr |
నెల్లూరు | 0.78 cr |
ఏపీ+తెలంగాణ | 16.15 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.43 cr |
ఓవర్సీస్ | 2.57 cr |
వరల్డ్ టోటల్ | 23.15 cr (షేర్) |
‘కన్నప్ప’ (Kannappa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.86 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.87 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమా రూ.23.15 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.41.1 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.63.85 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది కష్టమే కానీ.. రెండో ఆదివారం ఇంకాస్త క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.