టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో సినిమాలను తెరకెక్కించిన హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హను రాఘవపూడి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొన్ని పాటలకు వృద్ధాప్యం రాదని సీతారామం కూడా అలాంటి కోవకు చెందిన పాటలు ఉన్న మూవీ అని హను రాఘవపూడి తెలిపారు. తన సినిమాలలో కథకు తగిన విధంగా టైటిల్స్ ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.
సీతను రావణుడు తీసుకెళ్లిన సమయంలో రాముడు పడిన సంఘర్షణ అసలైన సంఘర్షణ అని ఆయన చెప్పుకొచ్చారు. 1965 సమయంలో మనుషులు మంచోళ్లు అని వాళ్లకు మనకు చాలా తేడా ఉందని హను రాఘవపూడి తెలిపారు. 2020 ఏప్రిల్ లో సీతారామం షూట్ చేయాలని అనుకుంటే కరోనా వల్ల ఆలస్యమైందని ఆయన చెప్పుకొచ్చారు. యాక్టర్ ను మైండ్ లో పెట్టుకొని కథ రాయనని ఆయన తెలిపారు. నాని నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అని ఆయన తెలిపారు.
ఇతర భాషల్లో కథ చెప్పడం నాకు చాలా కష్టమని ఆయన చెప్పుకొచ్చారు. మణిరత్నం గారిని ఇమిటేట్ చేసేంత టాలెంట్ నాకు లేదని హను రాఘవపూడి తెలిపారు. సీతారామం సినిమాను చూసే సమయంలో ఒక్క నిమిషం కూడా తల పక్కకు తిప్పరని హను రాఘవపూడి పేర్కొన్నారు. సీతారామం కేవలం లవ్ స్టోరీ కాదని ఆయన తెలిపారు.
నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని నేను ఎప్పటినుంచి ప్రయత్నిస్తున్నానో హను రాఘవపూడి పేర్కొన్నారు. 2009 నుంచి ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయని హను రాఘవపూడి వెల్లడించారు. నేను 2,3 కథలు తారక్ కు చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ సునామి అని హను రాఘవపూడి పేర్కొన్నారు.