తెలుగులో తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించినా దర్శకుడిగా హను రాఘవపూడి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. క్లాస్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా కథ, కథనం స్లోగా ఉన్నాయని ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమా కొత్త అనుభూతిని కలిగించిందని ప్రేక్షకులను వెంటాడేలా సినిమా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హను రాఘవపూడి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
గతంలో నేను తారక్ తో ఒక సినిమా చేయనున్నట్టు ప్రచారం జరిగిందని ఆ ప్రచారం నిజమేనని హను రాఘవపూడి అన్నారు. బ్రహ్మానందం గారితో ఉన్న పరిచయం వల్ల ఎన్టీఆర్ కు కథ చెప్పే అవకాశం దక్కిందని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు. కథ వినే సమయానికి తారక్ స్టార్ హీరో అని హను రాఘవపూడి పేర్కొన్నారు. తారక్ కు కథల విషయంలో పరిమితులు ఉండటంతో సినిమా చేయలేదని హను రాఘవపూడి అన్నారు.
ఆది మూవీ చూసి తారక్ కు ఫ్యాన్ గా మారిపోయానని ఆయన చెప్పుకొచ్చారు. తారక్ సినిమా విడుదలైతే థియేటర్లలో తొలిరోజే ఆ సినిమా చూసేస్తానని ఆయన కామెంట్లు చేశారు. తారక్ తో ఉన్న పరిచయం వల్ల లై మూవీ కథను ఆయనకు చెప్పానని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా అభిమానమని హను రాఘవపూడి పేర్కొన్నారు.
తారక్ తనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అయితే తారక్ కు ఉన్న ఇమేజ్ కు తారక్ ను హ్యాండిల్ చేయగలనో లేదో అనే అనుమానం అయితే ఉందని హను రాఘవపూడి కామెంట్లు చేశారు. త్వరలో నానితో సినిమా చేస్తానని హను రాఘవపూడి పేర్కొన్నారు. అందాల రాక్షసి కథను మొదట నానికి చెప్పానని ఆయన అన్నారు.