పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) కాంబినేషన్లో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎ.ఎం.రత్నం (A. M. Rathnam) నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. మొదటి భాగంని ‘హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. ‘ధర్మం కోసం యుద్ధం’ అనేది క్యాప్షన్. అలాగే ఈరోజు(మే 2న) టీజర్ ను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
వాళ్ళు చెప్పినట్టే ఈరోజు 9 గంటలకి టీజర్ ను వదిలారు. 1 :37 నిమిషాల నిడివి కలిగి ఉంది ఈ టీజర్. 17వ శతాబ్దంలో పేదలు కష్టపడి సంపాదించుకున్న సంపదని దొరలు ఎలా దోచుకుని వారిని హింసించేవారో. ఎదిరించిన వారిని ఎలా ప్రాణాలు తీసేవారో.. ఈ టీజర్లో చూపించారు. వారి కోసం పోరాడటానికి భగవంతుడు పంపిన ఓ గజదొంగగా హీరో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత ఆ పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడి ఎలా యోధుడు అయ్యాడో ఈ మొదటి భాగం సారాంశం అని తెలుస్తుంది. టీజర్లో చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం ఓడరేవు వంటి సెట్స్ అలాగే వీరమల్లుగా పవన్ కళ్యాణ్ చేసే వీరోచిత పోరాటాలు హైలెట్ గా నిలిచాయి అని చెప్పాలి.ఈ ఏడాదే మొదటి భాగం రిలీజ్ అవుతుంది అని కూడా ఈ టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు మేకర్స్. ఇక టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :