తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హరీష్ శంకర్ (Harish Shankar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ (Gabbar Singh) లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన ఆయన, ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’తో (Mr Bachchan) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, ఆయనపై కొంత విమర్శలు రావడానికి దారితీసింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా చేయాల్సి ఉన్నా, రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కారణంగా షూటింగ్ ఇంకా మొదలవలేదు.
ఇక హరీష్ శంకర్ కెరీర్ విషయాలు పక్కన పెడితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయ్యారు. తన భార్య స్నిగ్ధతో కలిసి పిల్లలు ఉండకూడదన్న నిర్ణయం ఎలా తీసుకున్నారో పంచుకున్నారు. “నాకు మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానన్న బాధ్యత ఎప్పుడూ ఉంటుంది. నాకు ఇంకా ఇతర బాధ్యతలు ఉండకూడదనిపించింది. అందుకే పిల్లలు వద్దనుకున్నాం” అని హరీష్ పేర్కొన్నారు.
ఈ నిర్ణయంలో తన భార్య స్నిగ్ధకు పూర్తి మద్దతు ఉందని కూడా హరీష్ వివరించారు. “పిల్లలు పుట్టిన తర్వాత మన జీవితం వాళ్ల చుట్టూ తిరుగుతుంది. అప్పుడే స్వార్థం మొదలవుతుంది. జీవితం అంతా వాళ్ల కోసమే మారిపోతుంది” అంటూ తన ఆలోచనను వివరించారు. ప్రధాని మోదీ గురించి కూడా ప్రస్తావించిన హరీష్, “ఆయనకి పిల్లలు లేరు కనుకనే నిస్వార్థంగా దేశాన్ని సేవ చేస్తున్నారు” అని అన్నారు.
తన భార్యకు సినిమాలంటే ఆసక్తి పెద్దగా లేదని, ఆమెకు తాను సినిమాల గురించి చెప్పినా ఎంతో సమయం తీసుకోదని చెప్పారు. ఇంట్లో సినిమాల చర్చలే కాదు, తన రెమ్యూనరేషన్ విషయాన్ని కూడా ఆమె తెలుసుకోదని చెప్తూ నవ్వించారు. వ్యక్తిగత విషయాలను మామూలుగా పంచుకోని హరీష్, ఈసారి తన జీవితంలో తీసుకున్న కీలక నిర్ణయాన్ని బయటపెట్టడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.