Hello Guru Prema Kosame Collections: ‘హలో గురు ప్రేమ కోసమే’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం 2018 వ సంవత్సరం అక్టోబర్ 18న విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ విజయవంతంగా దూసుకుపోతున్న టైములో ఎటువంటి అంచనాలు లేకుండా పక్కన ఈ చిత్రం విడుదలయ్యింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాన్ని కొంచెం అటు ఇటు తిప్పి తీసినట్టుగా ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించారు.

ఫైనల్ గా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందంటే :

నైజాం 7.70 cr
సీడెడ్ 2.90 cr
ఉత్తరాంధ్ర 2.98 cr
ఈస్ట్ 1.30 cr
వెస్ట్ 0.92 cr
గుంటూరు 1.30 cr
కృష్ణా 1.27 cr
నెల్లూరు 0.63 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 19.10 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  1.59 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  20.69 cr

‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రానికి రూ.17.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.20.69 కోట్ల షేర్ ను రాబట్టింది.దాంతో బయ్యర్లకు రూ.3 కోట్ల వరకు లాభాలు దక్కినట్టు అయ్యింది. ‘హైపర్’ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి పరాజయాలతో సతమతమవుతున్న రామ్ కు ఈ చిత్రం రిలీఫ్ ను ఇచ్చిందనే చెప్పాలి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Share.