Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » వినాయక్ చేతుల మీదుగా విడుదలైన హలో మీరా ట్రైలర్

వినాయక్ చేతుల మీదుగా విడుదలైన హలో మీరా ట్రైలర్

  • November 4, 2022 / 09:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వినాయక్ చేతుల మీదుగా విడుదలైన  హలో మీరా ట్రైలర్

సింగిల్ క్యారెక్టర్‌తో ఓ డిఫరెంట్ మూవీ రూపొందించి తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే సంకల్పంతో హలో మీరా సినిమా రూపొందిస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకుడిగా పని చేసిన అనుభవాన్ని రంగరించి ఈ ప్రయోగాత్మక సినిమాను తెరకెక్కిస్తున్నారు. హలో మీరా అనే టైటిల్ తోనే ఆడియన్స్ దృష్టిని తన సినిమా వైపు మరల్చుకున్న యూనిట్.. రీసెంట్ గా వదిలిన పోస్టర్స్, టీజర్ తో అంచనాలు పెంచేశారు.

హలో మీరా అనేది ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీ అని ప్రేక్షకుల్లో ఓ భావన నెలకొల్పిన చిత్రయూనిట్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ వదిలారు. ట్రైలర్ వీడియో చూసిన డైరెక్టర్ వీవీ వినాయక్ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగా వచ్చిందని అన్నారు. కేవలం సింగిల్ క్యారెక్టర్ తీసుకొని ఇంత థ్రిల్ చేసే సినిమా తీయడమనేది ఓ సవాల్‌తో కూడిన పని అని, అందులో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని ఈ ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోందని అన్నారు. ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు వీవీ వినాయక్.

2 నిమిషాల 26 సెకనుల నిడివితో కట్ చేసిన ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమాలోని మీరా అనే సింగిల్ క్యారెక్టర్ ని చూపిస్తూ జీవితంలో చేసిన ఓ చిన్న తప్పు ఆమెకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? కుటుంబం, పెళ్లి, స్నేహితులు, పోలీసులు ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో మీరాకు వచ్చిన చిక్కులేంటి? అనేది ఈ సినిమాలో చూపించనున్నారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మీరా అనే క్యారెక్టర్ తోనే ఈ ట్రైలర్ రూపొందించి సినిమాపై ఆసక్తి మరింత పెంచేశారు మేకర్స్.

ఎలాంటి భారీ తారాగణాన్ని ఎంచుకోకుండా ప్రయోగాత్మక కథతో ఈ మూవీ ప్లాన్ చేశారని ఈ ట్రైలర్ స్పష్టం చేసింది. వైవిద్యభరితమైన కథలో ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమానే ఈ హలో మీరా అని తాజాగా వదిలిన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి రాత్రికి రాత్రి ఆ పెళ్లి కాదనుకొని కారులో హైదరాబాద్ బయల్దేరడం, ఆ తర్వాత మీరా పరిస్థితి ఎలా ఉంది? అనే కాన్సెప్ట్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కానుందని తెలుస్తోంది.

లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. డా : లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు. ప్రశాంత్ కొప్పినీడి సినిమాటోగ్రఫీ అందించారు. అనంత శ్రీధర్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్ గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. హిరన్మయి కళ్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు. ప్రశాంత్ కొప్పినీడి అందించిన విజువల్స్ సినిమాలో హైలైట్ కానున్నాయట. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hello Meera
  • #v.v.vinayak

Also Read

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

related news

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

trending news

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

6 hours ago
Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

14 hours ago
OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

14 hours ago
Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

1 day ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago

latest news

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version