ఈ మధ్యనే వెంకటేష్ మహా అనే దర్శకుడు… ఇండియా మొత్తం మెచ్చిన కె.జి.ఎఫ్ చిత్రం గురించి చేసిన నెగిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘ ‘కె.జి.ఎఫ్’ లో హీరో నీచ్ కమీనే కుత్తే గాడని.. బంగారం మొత్తం తీసుకెళ్లి సముద్రంలో పడేసి.. తనను నమ్ముకున్న వాళ్ళకి ఇందిరమ్మ పథకంలో ఇళ్ళు ఇచ్చాడని.. అసలు ఆ హీరోని అంత నీచ్ కమీనే కుత్తేగాడిని అవ్వమని కోరిన ఆ తల్లిని కలుసుకోవాలని ఉందని’..
దర్శకుడు వెంకటేష్ మహా కామెంట్లు చేశాడు. అటు తర్వాత క్షమాపణలు చెప్పినప్పటికీ ‘పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా సమానంగా ఆదరిస్తే బాగుంటుంది’ అంటూ కామెంట్లు చేశాడు. సరిగ్గా ఈ పాయింట్ మీద చాలా మంది పెద్ద హీరోలు, దర్శకులు హర్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మధ్యనే ‘బలగం’ సినిమా సక్సెస్ మీట్ లో హరీష్ శంకర్ .. పరోక్షంగా వెంకటేష్ మహాకి క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు హీరో నాని వంతు వచ్చింది.
ఈ విషయం పై నాని స్పందిస్తూ.. ” ఉమెన్స్ డే రోజున ఆ డైరెక్టర్స్ అంతా కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూని నేను కూడా చూశాను. వెంకటేష్ మహా మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు.అది అతని ఒపీనియన్. ఆ ఇంటర్వ్యూలో అప్పటి వరకు జరిగిన డిస్కషన్ ఉన్నట్టుండి.. సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్స్ అంతా థియేటర్ బయటకు వచ్చి మాట్లాడుకున్నట్టు అయిపోయింది. అందువల్ల వెంకటేష్ ని భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.
ఓ వ్యక్తి తన అభిప్రాయాన్ని చెబుతున్నప్పుడు పక్కనున్న వాళ్లకు నవ్వు వస్తుంది. వాళ్ళు నవ్వడానికి కూడా మొహమాటపడతారు. అందువల్ల మహా ఒపీనియన్ ఇంకా తప్పు అన్నట్లు టర్న్ తీసుకుంది. అయినా 10 సెకన్ల వీడియో చూసి జడ్జి చేయడం అనేది చాలా తప్పు. నిజానికి ఓ మాస్ సినిమా చూస్తున్నప్పుడు మాలో అందరికంటే ఎక్కువగా చప్పట్లు కొట్టి గోల చేసేది ఆ దర్శకులే” అంటూ చెప్పుకొచ్చాడు