నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’ ఇటీవల అంటే డిసెంబర్ 7 న రిలీజ్ అయ్యింది. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీతో ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.మృణాల్ ఠాకూర్ హీరోయిన్. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూస్ అన్నీ సూపర్ పాజిటివ్ గా వచ్చాయి.
కానీ ఎందుకో బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. అలా అని తీసిపారేసే విధంగా కూడా లేవు. శని, ఆదివారాలు పర్వాలేదు అనిపించే విధంగా ఉంటాయి. కానీ ‘దసరా’ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ను ‘హాయ్ నాన్న’ వీకెండ్ కలెక్షన్స్ మ్యాచ్ చేయకపోవచ్చు. ఇక ఈ సినిమాకి రూ.63 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది. రూ.68 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. నిర్మాతకి రూ.5 కోట్లు టేబుల్ ప్రాఫిట్ దక్కింది.
శాటిలైట్ రైట్స్ బిజినెస్ ఇంకా చర్చల్లో ఉంది అని తెలుస్తుంది. అయితే (Nani) నాని ఇంకా తన పూర్తి పారితోషికం తీసుకోలేదు అని తెలుస్తుంది. ఇప్పుడు నాని రెమ్యూనరేషన్ రేంజ్ రూ.25 కోట్లు. ‘హాయ్ నాన్న’ కి అడ్వాన్స్ రూపంలో రూ.6 కోట్లు అందుకున్నారు అని తెలుస్తుంది. సినిమాకి అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యింది. దీంతో లాభాలు వస్తే నాని.. మిగిలిన పారితోషికం తీసుకుంటాను అని చెప్పినట్టు సమాచారం.
ఇప్పుడు థియేట్రికల్ గా నిర్మాతలకి లాభాలు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. అయినా నాని ఇంకా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇలా పారితోషికం ఫుల్ గా తీసుకోకుండా, సినిమాని ఇంకా ప్రమోట్ చేయడం అంటే మాటలు కాదు. ఆ విషయంలో నాని చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇలా నిర్మాతలకి అండగా నిలబడ్డ నానిని చూసి మిగిలిన టాలీవుడ్ స్టార్ హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పినా అతిశయోక్తి అనిపించుకోదు.