రోడ్డు ప్రమాదంలో గాయాలుపాలైన యువ హీరో..!
- April 27, 2019 / 07:00 PM ISTByFilmy Focus
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పరిసర ప్రాంతంలో సినీ నటుడు సుధాకర్ కొమకుల ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురయ్యింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైవే లో కారు వేగంగా వెళ్తున్న సమయంలో… అదుపుతప్పి ఓ మహిళను ఢీకొందని తెలుస్తుంది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఇక సుధాకర్ కు గాయాలయ్యాయి.

- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నాగరాజు పాత్రతో బాగా పాపులర్ అయ్యాడు ఈ యువ హీరో సుధాకర్ కోమకుల. ‘మనసుతో’ అనే చిన్న ఛితంతో పాటూ తేజ డైరెక్షన్లో వచ్చిన ‘ఒక విచిత్రం’ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ‘నువ్వు తోపురా’ అనే చిత్రంలో కూడా నటించాడు.
తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రభాస్ విడుదల చేసాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్ల రీత్యా ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళాడట సుధాకర్. తిరిగి వస్తున్నప్పుడు హైవే పై అదుపు తప్పిన కారు.. అక్కడ మొక్కలకి నీళ్ళు పోస్తున్న ఓ మహిళను ఢీకొందట. వెంటనే ఆ మహిళ దుర్మరణం చెందగా.. స్వల్ప గాయాలతో సుధాకర్ బయటపడ్డాడు. ప్రస్తుతం పోలీస్ కేసు ఫైల్ అవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారని తెలుస్తుంది.













