హిట్ ఇచ్చిన ఊపు.. సూర్య స్పీడ్ మామూలుగా లేదు..!

‘ఎన్జీకే’ ‘బందోబస్త్’ వంటి సినిమాలు సూర్య క్రేజ్ ను బాగా డామేజ్ చేసాయి. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా ఆ సినిమాలు ఘోర పరాజయాన్ని చవి చూశాయి. ఈ నేపథ్యంలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా రూపంలో సాలిడ్ హిట్ దొరికింది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్లోనే విడుదల చేశారు. ఎయిర్‌ డెక్కన్‌ సంస్థ అధినేత అయిన జీ.ఆర్.‌గోపీనాథ్‌ ‘సింప్లి ఫ్లై’ అనే బుక్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించింది

దర్శకురాలు సుధా కొంగర. సూర్య అద్భుతమైన నటన, దర్శకురాలు టేకింగ్ ఈ సినిమాని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. దర్శకురాలు సుధా కొంగర అయితే.. ‘మణిరత్నం శిష్యురాలు అనిపించుకుంది’ అనే ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈ చిత్రం తరువాత సూర్య 10 సినిమాలను లైన్లో పెట్టాడని సమచ్చరం. అలా అని ఆ సినిమాలన్నిటిలో సూర్యనే హీరోగా నటిస్తున్నాడని కాదు. అతను హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు తన భార్య జ్యోతికను పెట్టి రెండు,మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ప్లాన్ చేసాడట. అంతేకాకుండా తాను హీరోగా నటించబోతున్న సినిమాలు అలాగే.. వేరే హీరోలతో నిర్మించబోయే సినిమాలు.. ఇలా మొత్తం కలిపి 10సినిమాలను లైన్లో పెట్టాడట సూర్య. ఇదంతా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా హిట్ ఇచ్చిన ఊపే అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus