పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి (Pawan Kalyan) పొలిటికల్ పవర్ వచ్చాక ఆయనకు అభినందనల వర్షం కురుస్తోంది. వివిధ సినిమా పరిశ్రమల నుండి ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే అవ్వడం ఒకటి అయితే, డిప్యూటీ సీఎం కావడం మరో ఎత్తు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు ఉపేంద్ర కూడా పవన్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిత్ర పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టి విజయం అందుకున్న పవన్ కల్యాణ్‌ను చూస్తే గర్వంగా ఉందని ఉపేంద్ర అన్నారు.
ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు చెప్పిన ఉపేంద్ర.. పవన్ సిద్ధాంతాలతో ఆంధ్రప్రదేశ్‌లో మార్పొస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉపేంద్రకు కూడా రాజకీయాల్లో పని చేసిన అనుభవం ఉన్న సంగతి తెలిసిందే ఉపేంద్ర (Upendra) ఫ్యాన్స్ కల్ట్ సినిమాగా పిలుచుకునే ‘ఏ’ (A) రీ రిలీజ్ కానున్న సందర్భంగా ఉపేంద్ర ఇటీవల హైదరాబాద్ వచ్చారు. సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు.
అందులోనే పవన్ గురించి, రాజకీయాల గురించి మాట్లాడారు. గతంలో ఒకసారి మాత్రమే పవన్‌ను కలిశానని గుర్తుచేసుకున్న ఉపేంద్ర.. ఆయన సిద్ధాంతాల వల్ల ఏపీలో మార్పు రావాలని ఆశిచారు. ఇక మీరు పార్టీని వదిలిపెట్టి పూర్తిస్థాయిలో సినిమాలకే పని చేస్తున్నారా? అని అడగ్గా పార్టీని చూసుకుంటేనే నటిస్తున్నా అని చెప్పారు. పాలిటిక్స్ అంటే ఫండ్స్, లీడర్స్, ఫేమ్, వ్యక్తుల పేరు చూసి ఓటెయ్యడం అని కొంతమంది అనుకుంటారని, తన ఉద్దేశంలో ఫండ్ లేకుండా పార్టీ ముందుకెళ్లాలి అని చెప్పారు.
నిజానికి ఈ విషయంలో ప్రజలే చొరవ తీసుకోవాలని అన్నారు. ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ అధ్యక్షుడిగా పని చేస్తున్నానే తప్ప ఎన్నికల్లో పోటీ చేయను అని ఉపేంద్ర మరోసారి క్లారిటీ ఇచ్చారు. అలాగే తన కుటుంబ సభ్యులు కూడా పోటీలో నిలబడరు అని చెప్పారు. ఫైనల్‌గా ఆయనొచ్చిన విషయం చూస్తే… ఈ నెల 21న తెలుగు రాష్ట్రాల్లో ‘ఏ’ సినిమా రీ రిలీజ్ అవుతోంది.