త్రివిక్రమ్, బన్నీ కాదు… వాళ్ళే నిజమైన హీరోలంట..!

  • January 28, 2020 / 06:08 PM IST

ఈ సంక్రాంతికి విడుదలైన అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. పాన్ ఇండియా చిత్రాలకు కూడా సాధ్యం కాని కలెక్షన్లు ఈ చిత్రానికి వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే కథ పరంగా ఈ చిత్రంలో కొత్తదనం ఏమీ ఉండదు. త్రివిక్రమ్ గత చిత్రాలు అయిన ‘అత్తారింటికి దారేది’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘అఆ’ ‘అజ్ఞాతవాసి’ సినిమాల స్టైల్ లోనే ఈ చిత్రం కూడా సాగుతుంది. ఇక కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కంటే ఎక్కువగా రాణిస్తుంది.

అయితే ఈ చిత్రం ఇంత పెద్ద ఘనవిజయం సాధించడం వెనుక బన్నీ, త్రివిక్రమ్ ల కంటే.. అసలు హీరోలు మరో ఇద్దరున్నారట. వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం పై మొదటి నుండీ ఇంత పెద్ద హైప్ రావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇతని కెరీర్లోనే ఇది బ్లాక్ బస్టర్ ఆల్బం అని చెప్పాలి. ప్రమోషన్స్ విషయంలో కూడా ఈ చిత్రం యూనిట్ సభ్యులు ఎక్కువగా మ్యూజిక్ నే ఎక్కువగా ఉపయోగించుకున్నారు. యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ పైనే ‘సామజవరగమన’ పాట సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక మరో హీరో నిర్మాత అల్లు అరవింద్. సౌత్ లోనే పెద్ద నిర్మాత అయిన అల్లు అరవింద్.. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి మొదటి రోజు నుండీ ఎక్కువ థియేటర్లలో ప్రదర్శింపడేలా చేశారు. ఇప్పటికీ ఈ చిత్రం 500కు పైగా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతుంది అంటే ఆయన రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా రిలీజైన రెండు వారాల తర్వాత ఇన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శింపడడం అంటే మాటలు కాదు. ‘బాహుబలి’ (సిరీస్) తర్వాత ‘అల వైకుంఠపురములో’ చిత్రానికే అది కుదిరింది. ఇలా ‘అల వైకుంఠపురములో’ ఘనవిజయం వెనుక ఈ ఇద్దరు హీరోలు కీ రోల్ ప్లే చేసినట్టు స్పష్టమవుతుంది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus