న్యాచురల్ స్టార్ నాని కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. నాని సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్న నేపథ్యంలో నాని రెమ్యునరేషన్ ఒకింత భారీగా ఉన్నా నిర్మాతలు నానితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దసరా స్థాయిలో కాకపోయినా హాయ్ నాన్న సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే బిజినెస్ జరిగింది. సోలో డేట్ దొరికి ఉంటే హాయ్ నాన్న మూవీకి మరింత భారీ స్థాయిలో బిజినెస్ జరిగేది.
మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో (Hi Nanna) నానికి జోడీగా నటించగా ఈ సినిమాతో మృణాల్ జాతకం మారిపోనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నాని పొలిటీషియన్ గెటప్ వేసుకుని ప్రమోషన్స్ చేయడం ద్వారా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇతర హీరోలు సైతం సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ విషయంలో నానిని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది.
తనదైన శైలిలో ప్రమోషన్స్ చేస్తున్న నాని సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ మరిన్ని రికార్డ్ లను క్రియేట్ చేస్తారేమో చూడాలి. నాని పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. న్యాచురల్ స్టార్ నాని టైర్2 హీరోలలో నంబర్ వన్ హీరోగా నిలుస్తుండటం గమనార్హం. నాని తన కామెడీ టైమింగ్ తో ప్రమోషన్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మల్టీస్టారర్ సినిమాలలో ఛాన్స్ వస్తున్నా నాని ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశారని సమాచారం.
గతంలో ఎదురైన కొన్ని అనుభవాల వల్ల నాని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నానికి కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలు దక్కుతాయేమో చూడాలి. ఇతర భాషల్లో సైతం నాని సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కథాబలం ఉన్న సినిమాలకు నాని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.