2024 లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలను వేళ్ళపై లెక్క పెట్టొచ్చు. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) వరకు ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా.. ‘దేవర’ (Devara) వరకు పెద్ద సినిమా లేదు. ఇప్పుడు ఈ సినిమా హవా కూడా ఫైనల్ స్టేజీకి వచ్చేసింది. ఇక నెక్స్ట్ హోప్ ‘పుష్ప 2’ (Pushpa 2) నే..! మొత్తంగా 2024 లో 4 పెద్ద సినిమాలు మాత్రమే రిలీజ్ అయినట్టు అనుకోవాలి. పెద్ద సినిమా రిలీజ్ అవ్వకపోతే.. థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.
Prabhas, Ram Charan
చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా.. వాటి రేంజ్ కి తగ్గట్టే క్యాష్ చేసుకుంటాయి. సింగిల్ స్క్రీన్స్ లో వాటిని ఎక్కువగా జనాలు చూడరు. పెద్ద సినిమాలు ఉంటేనే సింగిల్ స్క్రీన్స్ కళకళలాడుతూ ఉంటాయి. గతేడాది తెలుగు రాష్ట్రాల్లో 2400 సింగిల్ స్క్రీన్స్ ఉంటే.. ఈ ఏడాది వాటి లెక్క 1600 కి పడిపోయింది. ఇందులో కూడా కొన్ని థియేటర్లు పెద్ద సినిమాలు వచ్చినప్పుడే ఓపెన్ అవుతున్నాయి.
పోనీ వచ్చే ఏడాది అయినా సింగిల్ స్క్రీన్స్ కి హోప్ ఉందా అంటే.. అలాంటిదేమీ కనిపించడం లేదు. 2025 లో రాంచరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) , చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) , బాలయ్య (Nandamuri Balakrishna), వెంకటేష్ (Venkatesh Daggubati) ..ల సినిమాలు మొదట్లో రిలీజ్ అవుతాయి. సమ్మర్ కి ప్రభాస్ (Prabhas) చేస్తున్న ‘ది రాజాసాబ్’ (The Rajasaab) వస్తుంది. ఆ తర్వాత ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చిరు, బాలయ్య, వెంకటేష్..ల సినిమాలు హిట్ అయినా.. వాటికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని చెప్పలేం.
సో 2025 కి హోప్స్ అంటే రాంచరణ్, ప్రభాస్ (Prabhas) మాత్రమే అని చెప్పాలి. ఎన్టీఆర్ (Jr NTR) , అల్లు అర్జున్(Allu Arjun) ..ల సినిమాలు ఆ ఏడాది రావడం కష్టం. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)పై అంచనాలు లేవు. ‘ఓజీ’ (OG) పై అంచనాలు భారీగా ఉన్నాయి. అది కూడా మొదటి 4,5 నెలల్లోనే రిలీజ్ అవుతుంది. సో ఎలా చూసుకున్నా.. 2025 సెకండాఫ్ చాలా దారుణంగా ఉండబోతుంది అని స్పష్టమవుతుంది.