‘అఖండ’ పోస్టర్ రోర్ : చిరు, ప్రభాస్ ల మధ్య క్లాష్ : పవన్ తో వినాయక్

‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయాల త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.గురువారం (జూన్ 10న) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం 04:36 గంటలకు కొత్త పోస్టర్ విడుదల చేశారు. దీనికి ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నందమూరి అభిమానుల్లో పోస్టర్ విడుదలతో ముందుగా పుట్టినరోజు సంబరాలు మొదలయ్యాయి. ఆల్రెడీ టైటిల్ రోర్ పేరుతో విడుదలైన ‘అఖండ’ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కేవ‌లం 16రోజుల్లోనే 50మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియ‌న్స్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సాధారణంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా సంక్రాంతి, సమ్మర్, దసరా పండుగ సమయంలో రిలీజవుతాయి. కరోనా వైరస్ విజృంభణ వల్ల ఈ ఏడాది సమ్మర్ లో వకీల్ సాబ్ మినహా మరే సినిమా రిలీజ్ కాలేదు. జులై నుంచి థియేటర్లు తెరిచే అవకాశాలు కనిపిస్తున్నా 100 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులోకి వచ్చే వరకు పెద్ద హీరోలు తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలను రూపొందించి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వి.వి.వినాయక్ కు ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గాయి. చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ ను వినాయక్ డైరెక్ట్ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ ఆయన చేసిన మార్పులు చిరుకి నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ చేతులో దాటింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు వినాయక్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెడుతోన్న సంగతి తెలిసిందే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ ఆడియన్స్ కు దగ్గరైన హీరో రామ్.. ఇప్పుడు మాస్ కథల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటించిన ‘రెడ్’ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ హీరో మాత్రం ఇప్పుడు తన సినిమా రెమ్యునరేషన్ పెంచేసినట్లు సమాచారం. తన కొత్త సినిమాకి రామ్ రూ.10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. బైలింగ్యువల్ సినిమా కావడంతో రామ్ ఎక్కువ మొత్తం అడుగుతున్నాడట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఇప్పటికే చాలా మంది నటీమణులు ఓపెన్ అయ్యారు. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు సినీ పెద్దలెవరూ సరిగ్గా స్పందించలేదు. కానీ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటి కథ కాదని.. గత కొన్నేళ్లుగా పురాణాల నుండి వస్తోన్న అలవాటని అన్నారు. దేశానికి రాజైన వాడు.. అక్కడ దొరికే నగలు, డబ్బులతో పాటు అక్కడున్న ఆడవాళ్లని చెడగొట్టడం లాంటివి అతడి జీవితంలో భాగమని.. అది రానురాను రూపాంతరం చెందిందని సురేష్ బాబు అన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus