నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్ 3′(HIT 3)(హిట్ : ది థర్డ్ కేస్) రూపొందింది. ‘వాల్ పోస్టర్ సినిమా’ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్లపై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) ఈ సినిమాను నిర్మించారు. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మొదటి 2 పార్టులు హిట్ అవ్వడం వల్ల .. మూడో భాగంపై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు ‘హిట్ 3’ కి హిట్ టాక్ తెచ్చుకుంది.
ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. రెండో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కలెక్షన్స్ అదిరిపోయాయి.3వ రోజు తెలంగాణలో బాగానే కలెక్ట్ చేసింది. కానీ ఏపీలో పలు చోట్ల వర్షాల కారణంగా కొంచెం డౌన్ అయ్యింది. ఊహించని విధంగా 4వ రోజు కూడా డౌన్ అయ్యాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 12.98 cr |
సీడెడ్ | 3.79 cr |
ఉత్తరాంధ్ర | 3.70 cr |
ఈస్ట్ | 1.85 cr |
వెస్ట్ | 1.37 cr |
గుంటూరు | 2.03 cr |
కృష్ణా | 1.90 cr |
నెల్లూరు | 0.87 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 28.49 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.25 cr |
ఓవర్సీస్ | 10.65 cr |
మిగిలిన భాషలు | 0.92 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 45.31 cr |
‘హిట్ 3’ సినిమాకు రూ.48 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.45.31 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.83.2 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.3.69 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సోమవారం ఈ సినిమాకి అసలైన పరీక్ష అని చెప్పాలి.