Bigg Boss Telugu 6: ఫ్యామిలీ ఎపిసోడ్ తో ఎమోషనల్ అవుతున్న హౌస్ మేట్స్..! అసలు కారణం ఏంటంటే.,

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఫ్యామిలీ ఎపిసోడ్ నడుస్తోంది. ఒక్కొక్కరి హౌస్ మేట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఫైమా మదర్ వచ్చి సందడి చేసింది. జోక్స్ వేస్తూ హౌస్ మేట్స్ లో ఉత్సాహాన్ని నింపింది. ఫైమా మదర్ తో కలిసి గార్డెన్ ఏరియాలో డ్యాన్స్ చేస్తూ, ఆమెని హగ్ చేసుకుంటూ, ముద్దులు పెడుతూ బాగా ఎమోషనల్ అయిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఫైమా ఎమోషనల్ అయ్యేసరికి హౌస్ మేట్స్ అందరూ కూడా అదే ఫీల్ లో ఉండిపోయారు.

ముఖ్యంగా కీర్తి ఒక పక్కకి వెళ్లి మరీ బాధపడింది. తన కుటుంబంలో ఎవరూ లేరనే ఫీలింగ్ తో ఏడ్చేసింది. అంతేకాదు, ఆ తర్వాత శ్రీసత్య మదర్ ఫాదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీల్ ఛైర్ లో వచ్చిన శ్రీసత్య మదర్ ని చూసేసరికి హౌస్ మేట్స్ బాగా ఎమోషనల్ అయిపోయారు. శ్రీసత్య కంట్లోనుంచీ కన్నీళ్లు కారిపోయాయి. ఇది ప్రోమోలో చూసిన ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజానికి శ్రీసత్య గేమ్ పరంగా కొంతమంది ఆడియన్స్ లో నెగిటివిటీ వచ్చింది. కొన్ని సందర్భాల్లో శ్రీసత్య గేమ్ ని బాగా కామెంట్స్ చేస్తూ నెటిజన్స్ రెచ్చిపోయారు.

అయితే, ఇప్పుడు తన మదర్ కోసం గేమ్ ఆడిందని చూస్తూ చలించిపోతున్నారు. ఆమెని వీల్ ఛైర్ లో చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. అన్నం తినిపిస్తూ శ్రీసత్య చూపిన ప్రేమకి ముగ్ధులైపోతున్నారు. ప్రతి ఒక్కరూ మదర్ ని పొడుగుతూ అమ్మ ఎవరికైనా అమ్మే అంటూ కామెంట్స్ చేస్తూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లో ఇలా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన టాస్క్ అనేది జరుగుతూనే ఉంటుంది.

కానీ, ఈసారి సీజన్ లో ప్రతి ఒక్కరికీ కూడా ఫ్యామిలీ కష్టాలు ఉన్నాయి. వారి బాధలన్నీ కూడా గతంలో ఆడియన్స్ కి చెప్పుకున్నారు. శ్రీసత్య అయితే స్కిట్ రూపంలో కూడా తన లైఫ్ స్టోరీని చేసి మరీ చూపించింది. ఇప్పుడు శ్రీసత్య మదర్ ని చూసేసరికి అందరికీ అవి గుర్తుకు వస్తున్నాయి. వీల్ ఛైర్ లో ఆమెని తన తండ్రి తీస్కుని రావడం, బిగ్ బాస్ హౌస్ లో గుర్తుండిపోయేలా గురుతులని ఇవ్వడం అనేది హైలెట్ అవుతోంది.

అంతేకాదు, రాజ్ విషయంలో శ్రీసత్య నామినేషన్స్ లో అన్నీ ఇలాంటి పాయింట్స్ చెప్తుంటాడు అంటే, నీది కూడా నామినేషన్స్ ఇలాగే ఉంటాయని కౌంటర్ వేయడం, ఆ తర్వాత శ్రీసత్య నుదుటిపై ముద్దుపెట్టడం ఇవన్నీ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. దీంతో ఈ ప్రోమో ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ చప్పగా సాగినా కూడా ఇప్పుడు ఫ్యామీలీ ఎమోషనల్ ఎపిసోడ్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. మొత్తానికి అదీ మేటర్.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus