Meet Cute: ‘మీట్‌ క్యూట్‌’ షూట్‌ సమయంలో అంత జరిగిందా?

ఓటీటీల హవా ఏ రేంజిలో నడుస్తోంది అంటే.. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు, కుర్ర నటులు కూడా ఇటు ఓ లుక్కేద్దాం అనుకుంటున్నారు. అయితే తొలుత వచ్చిన ప్రతి సినిమ తీసుకుందాం అనుకున్న ఓటీటీలు కూడా.. ఇప్పుడు కొన్ని నిబంధనలు పెట్టుకున్నాయి. అయితే ఇటీవల ఓటీటీలు కొన్ని రకాల కంటెంట్‌ తీసుకోవడం మానేశాయి. అందులో ముఖ్యంగా అంథాలజీల విషయంలో వెనకడుగు వేస్తున్నాయి అంటున్నారు. అంటే నాలుగైదు కథల కలిపి తీసే వెబ్‌ సిరీస్‌లను పెద్దగా ప్రోత్సహించడం లేదు అంటున్నారు.

ఇటీవల కాలంలో తెలుగులో వచ్చిన ఆంథాలజీలకు సరైన స్పందన లేదు. దీంతోనే ఆంథాలజీ విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలోనే తెలుగు నిర్మాతలు అలాంటి ఆలోచన చేయడం లేదు అంటున్నారు. ఇలాంటి సమయంలో నాని సోదరి దీప్తి ‘మీట్‌ క్యూట్‌’ అనే ఆంథాలజీని వెబ్‌ సిరీస్‌గా రూపొందించారు. మరి దీనిని సోనీ లివ్‌ ఎలా ఓకే చేసింది అనే డౌట్‌ చాలామందికి వచ్చింది. అయితే దీని వెనుక పెద్ద చర్చే, కార్యక్రమమే జరిగిందట.

ఇంతకుముందు చెప్పినట్లు ‘మీట్ క్యూట్’ ఐదు కథలతో తెరకెక్కిన సిరీస్ ఇది. ఇలాంటి కంటెంట్‌ను ఎలా ఓటీటీకి ఒప్పించారు అంటే.. నాని ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఈ సిరీస్‌ షూటింగ్ సమయంలో సోనీ లివ్ సంస్థను ఈ సిరీస్ కోసం సంప్రదించారట. వెబ్‌ సిరీస్‌ కోసం ‘మీట్‌ క్యూట్‌’ పడ్డ శ్రమ, కష్టాన్ని సోనీ లివ్‌ టీమ్‌ దగ్గరుండి చూసిందట. కొన్ని ఎపిసోడ్స్ చూశాకే ఈ సిరీస్‌ను తీసుకుంటామని సోనీ లివ్‌ ముందుకొచ్చిందట.

అయితే సోనీ లివ్‌ అంత ధైర్యంగా ఆంథాలజీని తీసుకోవడానికి మందుకు రావడానికి నాని కూడా ఓ కారణమని చెప్పొచ్చు. ఈ సిరీస్‌ను ప్రమోట్‌ చేసుకోవడానికి నాని ఎలిమెంట్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ కారణంతోనే సోనీ లివ్‌ ముందుకొచ్చింది అని అంటున్నారు. అయితే ఈ సిరీస్ సక్సెస్ అయితే మిగతా ఓటీటీ సంస్థలు ఆంథాలజీలను తీసుకోవడానికి ముందుకొస్తాయేమో.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus