సినిమాల్లో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అవ్వొచ్చు.. బయట అన్నీ తెలియాలని లేవు కదా. అందుకే కౌన్ బనేగా కరోడ్‌పతీ కార్యక్రమానికి ఆమిర్ ఖాన్ వస్తున్నాడు అంటే అందరూ ఆతృతగా ఎదురు చూస్తన్నారు. ఆ స్పెషల్ ఎపిసోడ్ ఇటీవల ప్రసారమైంది. అందులో ఆమిర్ ఖాన్‌ను అమితాబ్ బచ్చన్ ఏం ప్రశ్నలడిగారు అనేది ఆసక్తికరమైన విషయం. ఆ వివరాలన్నీ ఈ వార్తలో చూసేయొచ్చు.
కౌన్ బనేగా కరోడ్‌పతీ కార్యక్రమం 14వ సీజన్ ఇటీవల మొదలైంది. తొలి ఎపిసోడ్‌లో ఆమిర్ ఖాన్ సందడి చేశాడు. ‘లాల్‌సింగ్ చడ్డా’ విడుదల నేపథ్యంలో ఆమిర్ ఈ కార్యక్రమానికి వచ్చారు అనొచ్చు. అమితాబ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చి రూ. 50 లక్షలు గెలుచుకున్నాడు ఆమిర్. అయితే ఆటలో సమయం అయిపోవడంతో అక్కడితో ఆమిర్ ఆట ఆగిపోయింది.
అమితాబ్ ప్రశ్న: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2021లో ఎక్కడ ప్రారంభించారు?
ఆమిర్ సమాధానం: గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం
అమితాబ్ ప్రశ్న: ఎలాన్ మస్క్ 2022 ఏప్రిల్‌లో ఏ సంస్థను కొనేందుకు ముందుకొచ్చారు?
ఆమిర్ సమాధానం: సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విటర్
అమితాబ్ ప్రశ్న: ‘నారీ శక్తి పురస్కారాన్ని’ రాష్ట్రపతి 2022లో ఏ రోజున అందించారు?
ఆమిర్ సమాధానం: మార్చి ఎనిమిది
అమితాబ్ ప్రశ్న: ‘భారత రత్న’ పురస్కారాన్ని ఒకరి చేతుల మీదుగా మరొకరు అందుకున్న రాష్ట్రపతులు ఎవరు?
అమితాబ్ ప్రశ్న: ఏ విప్లవకారుడి జీవితాధారంగా రూపొందిన సినిమా.. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’కి స్ఫూర్తి.
సమాధానం: చే గువేరా
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ కూడా అదే స్ఫూర్తితో ప్రారంభమైంది. 14వ ఎడిషన్ ప్రారంభానికి ఆమిర్ ఖాన్‌తోపాటు మేజర్ డీపీ సింగ్, కల్నల్ మిథాలీ మధుమిత, ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్, భారత ఫుట్‌బాల్ జట్టు సారథి సునీల్ ఛెత్రీ వచ్చారు.