Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » 70వ పడిలో పడినా రజనీ దూసుకెళ్లడానికి కారణమేంటి?

70వ పడిలో పడినా రజనీ దూసుకెళ్లడానికి కారణమేంటి?

  • December 12, 2020 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

70వ పడిలో పడినా రజనీ దూసుకెళ్లడానికి కారణమేంటి?

ఈ రోజు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పుట్టిన రోజు… ఎప్పటిలాగే రజనీకాంత్‌ గురించి ఇవి మీకు తెలుసా? రజనీ టాప్‌ రికార్డులు, రజనీకాంత్‌ బెస్ట్‌ పాత్రలు, రజనీ లైఫ్‌టైమ్‌ మెమొరీలు, రజనీ బెస్ట్‌ పిక్చర్స్‌ లాంటి వార్తలు కాకుండా… ఈరోజు ఓ ప్రశ్నతో ఈ స్టోరీ మొదలుపెడుతున్నాం. మాకు తెలిసి మీకు కూడా ఇలాంటి ప్రశ్న మనసులో మెదిలే ఉంటుంది. హెడ్డింగ్‌ చూశాక ఇంకో ప్రశ్న కూడా తప్పక వస్తుంది. 70 ఏళ్ల వయసులో రజనీకాంత్ ఎలా యూత్‌ని ఆకట్టుకుంటున్నాడు. హాలీవుడ్‌ స్టార్లు సిల్వర్‌స్టర్‌ స్టాలోన్‌, ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగర్‌కు సాధ్యం కానిది రజనీకి ఎలా వీలవుతోంది. పదండి చూద్దాం.

రజనీకాంత్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆయనలోని కీ పాయింట్స్‌ స్టైల్‌, ఆయన మేనరిజమ్స్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌. 45 ఏళ్లుగా వాటితోనే ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడా అంటే అవుననే చెప్పాలి. కథలో సత్తా లేకపోయినా ఆయన స్టైల్‌, మేనరిజమ్స్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌తోనే సినిమాలు హిట్ చేస్తున్నాడు. కొన్ని సినిమాలు మిస్‌ ఫైర్‌ అవ్వొచ్చు కానీ ఆయనలోని కీ పాయింట్స్‌ ఫ్లాప్‌ అవ్వలేదు. వాటిలో ఒకటి ఆయన చూపించే రెండు వేళ్లు గుర్తు. ‘బాబా’ సినిమాలో ఆయన ఆ గుర్తు చూపిస్తూ ఇచ్చే పోజు ఇప్పటికీ ఫేమస్‌. త్వరలో ఆయన స్థాపించబోతున్న రాజకీయ పార్టీ విషయంలోనూ ఆ గుర్తు కీలకం అవ్వబోతోంది.

ఇక ఆయన లాంగ్‌ జర్నీకి మరో కారణం… కొత్తదనం. ‘వయసు నెంబరు మాత్రమే’ అని సినిమా వాళ్లు అంటుంటారు. కానీ రజనీ దానిని చేసి చూపించాడు. ఆయన ఎంచుకునే కథల్లో కొత్తదనం ఎప్పుడూ కనిపిస్తుంది. దాని కోసం ఆయన తన ఎంపికలో చేసిన అతి పెద్ద మార్పు దర్శకులు. ఇటీవల కాలంలో యువ దర్శకులకే అవకాశం ఇస్తున్నాడు. అదే సమయంలో స్టార్‌ దర్శకులనూ వదలడం లేదు. రీసెంట్‌ మూవీస్‌ చేస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. పేట(కార్తిక్‌ సుబ్బరాజ్‌), కాలా, కబాలి (పా రంజిత్‌), అన్నాతె (శివ)… వీరందరూ కొత్తవాళ్లే. అదే సమయంలో రోబో, 2.0 (శంకర్‌), దర్బార్‌ (మురగదాస్‌) లాంటి సీనియర్ల సినిమాలు కూడా చేస్తున్నాడు. దీంతో రజనీ సినిమాల్లో కొత్తదనం కనిపిస్తుంటుంది. కథల విషయంలో ఎలాగూ మూసధోరణి ఫాలో అవ్వడు కాబట్టి… అది కూడా ప్లస్‌ పాయింట్‌.

వరుస సినిమాలు చేస్తున్నాడు అంటే.. అలా వచ్చి ఇలా వెళ్లేవి కూడా కావు. శివాజీ (2007) నుంచి పేట (2019) వరకు చూసుకుంటే ‘కోచ్చడయాన్‌’ మినహా మిగిలినవన్నీ బాగా ఆడినవే. వీటిలో ఎక్కువ శాతం ₹100 కోట్లు పైబడి గ్రాస్‌ వసూలు కూడా చేశాయి. మన దేశంతోపాటు విదేశాల్లో రజనీ గ్రాఫ్‌ పెరుగుతూనే ఉంది. యూఎస్‌ టాప్‌ 10 గ్రాసర్స్‌లో ఆరు సినిమాలు రజనీకాంత్‌వి కావడమే దీనికి ఉదాహరణ. ఓవర్సీస్‌ ఆడియన్స్ అంత త్వరగా భారతీయ సినిమాలను ఇష్టపడరనే విషయం తెలిసిందేగా. అంటే వాళ్లనూ రజనీ ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉన్నాడు.

మరి ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ (72), సిల్వర్‌స్టర్‌ స్టాలోన్‌ (73) కంటే రజనీ ఎందుకు గొప్ప అనేగా ప్రశ్న. దానికీ సమాధానముంది. ఇటీవల ఆర్నాల్డ్‌ స్వ్కార్జ్‌నెగ్గర్‌ ‘టెర్మినేటర్‌: డార్క్‌ ఫేట్‌’, స్టాలోన్‌ ‘రాంబో: లాస్ట్‌ బ్లడ్‌’ విడుదలయ్యాయి. అయితే ఆ రెండూ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. అభిమానులు, ప్రేక్షకులు అంతగా సినిమాను ఆదరించలేదు. వారి వయసుకు దగ్గరగా ఉన్న రజనీ ఇంకా అభిమానులను అలరిస్తున్నాడు. మరి ఈ లెక్కన వారికంటే రజనీ బెటరే కదా. రజనీ జోరు చూస్తుంటే రాజకీయాల్లోకి వెళ్లాక కూడా సినిమాల్లో చేసేలానే ఉన్నాడు. అంటే ఈ జోరు ఇంకా కొనసాగేలా ఉంది. ఇంత చెప్పుకున్నాక ఆఖరున తలైవాకి పిరందనాళ్ వాళ్తుక్కల్’ చెప్పేయండి. అదేనండి ‘జన్మదిన శుభాకాంక్షలు’.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!
Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajini
  • #Rajinikanth
  • #Super star
  • #Super Star Rajinikanth

Also Read

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

related news

Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Venkatesh, Rajinikanth: వెంకటేష్ కి రజినీకాంత్ నేర్పిన విలువైన పాఠం!

Venkatesh, Rajinikanth: వెంకటేష్ కి రజినీకాంత్ నేర్పిన విలువైన పాఠం!

trending news

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

2 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

2 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

3 hours ago
Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

5 hours ago

latest news

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

13 mins ago
Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

17 mins ago
Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

22 mins ago
తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

1 hour ago
Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version