రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రేంజ్ లో క్రేజ్ ను కలిగి ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు కాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అభిమానించే వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉంది. జనసేన పార్టీ కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తుండగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఈ ఏరియాలో జనసేనకు విజయం ఖాయమని చాలామంది భావించారు.
అయితే జనసేనకు ఊహించని సమస్య ఎదురైంది. కూకట్ పల్లి నుంచి పోటీ చేసే పార్టీలలో జాతీయ జనసేన అనే పార్టీ కూడా ఉంది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు కాగా జాతీయ జనసేన పార్టీ గుర్తు బకెట్ కావడం గమనార్హం. జనసేన తరపున ఇక్కడ ప్రేమ కుమార్ పోటీ చేస్తున్నారు. ప్రేమ్ కుమార్ స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో అతనికి ఈ ఏరియాలో మంచి పేరు ఉండటం గమనార్హం.
అయితే జనసేన, జాతీయ జనసేన పేర్లు దగ్గరగా ఉండటం, రెండు పార్టీల గుర్తులు కొంతమేర ఒకే విధంగా ఉండటం సమస్యగా మారింది. జాతీయ జనసేన ద్వారా జనసేన ఓట్లకు గండి కొట్టే ప్రయత్నం జరిగిందని సమాచారం అందుతోంది. ఓట్ల చీలిక కోసం జాతీయ జనసేన పేరుతో అభ్యర్థిని నిలబెట్టారని తెలుస్తోంది. జాతీయ జనసేన పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు పవన్ సినిమాలకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. పవన్ రాజకీయాల్లో సక్సెస్ కావడం కోసం సినిమాలు ఆలస్యమైనా పరవాలేదని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. (Pawan Kalyan) పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.