యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇరవై ఏళ్లకే అభినయంతో ఆకట్టుకున్నారు. ఆది, సింహాద్రిలో అతని నటనకు తెలుగు ప్రజలు జేజేలు పలికారు. ఎమోషన్, యాక్షన్ సీన్లలో తారక్ నటన అద్భుతం. కొంతకాలం పాటు విజయం అతనితో దొబూచులాడినా.. టెంపర్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇందులో ఎన్టీఆర్ నటనలో చూపించిన వేరియేషన్స్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రాన్ని పూరి హిందీలో రీమేక్ చేయాలనీ భావించారు.
హీరో గా బిగ్ బీ తనయుడు అభిషేక్ బచ్చన్ ని డిసైడ్ అయ్యారు. ఆయనకు టెంపర్ సినిమాను చూపించారు. ఆ చిత్రం చూసిన తర్వాత అభిషేక్ షాక్ తిన్నారు. ఎన్టీఆర్ హై వోల్టేజ్ నటన చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడే ఈ సినిమాని తాను చేయలేనని చెప్పారు. ఎందుకంటే ఎన్టీఆర్ లా నటించడం కష్టమని మనస్ఫూర్తిగా అంగీకరించారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను డైరక్టర్ పూరి జగన్నాథ్ నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు. కొన్ని కథలు కొందరికే సూట్ అవుతాయి. టెంపర్ లాంటి కథను మోయాలంటే ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం. ఇది సినీ పరిశ్రమకు తెలిసిన సత్యం.