విక్టరీ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ‘కూలీ నెంబర్ 1’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది టబు.ఆమె గ్లామర్ తో టాలీవుడ్ ను మాత్రమే కాదు బాలీవుడ్ ని కూడా ఓ ఊపు ఊపేసింది. 50 ప్లస్ ఏజ్ లో కూడా కుర్ర హీరోయిన్స్ ని డామినేట్ చేస్తూ గ్లామర్ రోల్స్ చేస్తుంది. ముఖ్యంగా బెడ్ రూమ్ సీన్స్ లో కూడా ఓ రేంజ్లో బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. ఓటీటీ ప్రాజెక్టుల రూపంలో ఇప్పటికీ కోట్లల్లో పారితోషికాలు అందుకుంటుంది. తెలుగులో రమ్యకృష్ణ మాదిరి తమిళంలో టబు ఆ రేంజ్లో బిజీగా గడుపుతోంది. అయితే ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు ఓ స్టార్ హీరో కారణం అంటూ ఒకానొక సందర్భంలో చెప్పి ఈమె పెద్ద షాక్ ఇచ్చింది.
Tabu
టబు ఈ విషయంపై స్పందిస్తూ.. “నేను పెళ్లి చేసుకోకపోవడానికి ముఖ్య కారణం ఓ స్టార్ హీరో. అతను మరెవరో కాదు అజయ్ దేవగన్. అతను నాకు.. 13 ఏళ్ళ వయసు నుండి తెలుసు.అతను నా సోదరుడు సమీర్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. జుహూలోనే మా చైల్డ్ హుడ్ అంతా గడిచింది. అప్పట్లో నా సోదరుడు, అజయ్ దేవగన్ ఓ గ్యాంగ్ ను కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళను మేము సరదాగా ఆటపట్టించేవాళ్ళం. అయితే నాతో ఏ అబ్బాయి అయినా మాట్లాడడానికి ట్రై చేసినా, వేరే దృష్టితో చూసినా.. అజయ్, సమీర్ లు.. వెళ్లి వాళ్ళని చితకబాదేవాళ్ళు. దీంతో మాతో మాట్లాడటానికి అబ్బాయిలు భయపడేవాళ్లు.అందుకే నాకు లవ్ లైఫ్ లేకుండా పోయింది.
సింగిల్ గా ఉండిపోవాల్సి వచ్చింది.? అజయ్ చిన్నప్పటి నుండి నా సోదరుడితో పాటు నన్ను కూడా ప్రొటెక్టివ్ గా చూసుకునేవాడు.నాకు ఏ సమస్య వచ్చినా వెంటనే నా దగ్గరకు వచ్చేస్తాడు. అందుకే అతనంటే నాకు చాలా అభిమానం. నేను పెళ్లి చేసుకోవడానికి ఓ మంచి అబ్బాయి ఉంటే చూడమని అతన్ని అడిగెడాన్ని. కానీ నాకు అంత ఈజీగా ఎవ్వరూ నచ్చరు అని అతనికి తెలుసు.అందుకే అతను కూడా సీరియస్ గా తీసుకునేవాడు కాదు(నవ్వుతూ)” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది.