మహేష్ బాబు లోని మాస్ యాంగిల్ ను బయట పెట్టి… అతనికి మొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన చిత్రం ‘ఒక్కడు’. ఎం.ఎస్.రాజు గారి నిర్మాణంలో గుణ శేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2003 సంక్రాంతి కానుకగా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి వరకూ పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ కోరికను ఈ చిత్రం తీర్చింది. ఇది మహేష్ బాబుకి 7 వ చిత్రం. నిజానికి ఇది 8 చిత్రంగా షూటింగ్ మొదలైంది.
‘నిజం’ చిత్రం మహేష్ 7వ చిత్రంగా విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ‘నిజం’ షూటింగ్ లేట్ అవ్వడం .. ‘ఒక్కడు’ ముందు రిలీజ్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం చూసి… ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఓ డైరెక్టర్ కు పుట్టిందట. ఆ దర్శకుడు మరెవరో కాదు… ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి). అవును స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ గా చేసిన ఈ దర్శకుడు ‘యువత’ ‘ఆంజనేయులు’ ‘సోలో’ ‘సారొచ్చారు’ ‘శ్రీరస్తూ శుభమస్తు’ ‘గీత గోవిందం’ వంటి చిత్రాలను అందించాడు.
అయితే ఈయనకి ఇండస్ట్రీ కి రావాలనే కోరిక పుట్టేలా చేసింది మాత్రం మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమానే అట. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ డైరెక్టర్ గా ఎదిగాడు సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఏ హీరో చిత్రం అయితే చూసి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడో.. ఇప్పుడు అదే హీరోని డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలిపాడు. అవును ‘మహేష్ 27’ ను పరశురామ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. భూమి గుండ్రంగా ఉంటుంది.. ఎవరు ఎక్కడికి అయినా చేరొచ్చు చెప్పలేం అని ఓ మహా కవి అన్నట్టు ఇలా జరిగిందన్న మాట.