సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. లెజెండ్రీ నటి భానుమతి రామకృష్ణ గారి మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆగస్ట్ 27న విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో జనాలు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు.’చి.ల.సౌ’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాల తర్వాత సుశాంత్ నుండీ వచ్చిన ఈ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’… టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
ఒకసారి మొదటి వారం కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
0.09 cr
సీడెడ్
0.05 cr
ఉత్తరాంధ్ర
0.06 cr
ఈస్ట్
0.05 cr
వెస్ట్
0.03 cr
గుంటూరు
0.05 cr
కృష్ణా
0.04 cr
నెల్లూరు
0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.07 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
0.46 cr
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ క్లీన్ హిట్ గా నిలవడానికి ఈ చిత్రం రూ.2.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి వారం ఈ చిత్రం కేవలం రూ.0.46 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.79 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఏదో అద్భుతం జరిగితే తప్ప.. అది అసంభవం.