ఎన్ని ఓటీటీలు వచ్చినా కానీ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే కిక్కే వేరు.. రోజురోజుకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వేల కోట్లకు పడగలెత్తుతోంది. అందులో భాగంగానే థియేటర్ సంప్రదాయంలో కొత్త కొత్త పద్దతులను తీసుకొస్తున్నారు బిజినెస్ వాళ్లు.. నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్‌లను విమానాశ్రయాల్లోకి కూడా విస్తరింపజేయడానికి కార్పోరేట్ దిగ్గజాలు భారీ ప్లాన్స్ వేస్తున్నారు.ఈ ప్రాసెస్‌లో ముందడుగు వేసింది PVR యాజమాన్యం. ఇండియాలో మెుదటిసారి విమానాశ్రయాంలో సినిమా థియేటర్‌ని ప్రారంభించినట్లు పీవీఆర్ సంస్థ ప్రకటించింది.
సాధారణంగా విమానాలు ఆలస్యంగా నడవడం, రద్దు అయిన సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురవుతుంటారు. ఇక గంటలకు గంటలు కాళీగా కూర్చుంటే.. వారికి బోర్ కొడుతుంది కూడా. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది ప్రముఖ మల్టీప్లెక్స్ యాజమాన్యం పీవీఆర్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పీవీఆర్ మల్టీప్లెక్స్ అతిపెద్ద యాజమాన్యం. ఇక దేశంలోనే మెుట్టమెుదటి మల్టీప్లెక్స్ ను ఎయిర్ పోర్ట్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసినట్లు బుధవారం (ఫిబ్రవరి 1) ప్రకటించింది.
చెన్నై విమానాశ్రయంలో తన కొత్త ఏరోహబ్ మల్టీప్లెక్స్ ను ప్రారంభించినట్లు పీవీఆర్ సినిమాస్ తెలిపింది. దాంతో ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన మెుట్టమెుదటి మల్టీప్లెక్స్ గా ఈ ఏరోహబ్ రికార్డు నెలకొల్పడం విశేషం. 1,155 మంది సీటింగ్ కెపాసిటీతో ఐదు స్క్రీన్లలో ఈ మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసింది. ఇక విమానాలు ఆలస్యంగా నడిచే క్రమంలో వెయిటింగ్ సమయంలో వారికి వినోదాన్ని అందించడంతో పాటు ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ మల్టీప్లెక్స్ అందుబాటులో ఉంటుంది అని,
ఈ థియేటర్ ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసినట్లు PVR లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ తెలిపారు. ట్రాన్సిట్ ప్రయాణీకులు తమ ఖాళీ టైమ్ ను సద్వినియోగం చేసుకోవడానికి సినిమాలు చూడటం కంటే మరో మంచి మార్గం లేదని ఆయన వెల్లడించారు. దీంతో ప్రయాణికులతో పాటు నార్మల్ మూవీ లవర్స్ కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు..