‘డీజే టిల్లు’, (DJ Tillu) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Squre)అంటూ రెండు సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలూ చూసి ఆనందించేశాం. అయితే తొలి సినిమాకు తొలుత అనుకున్న పేరు అది కాదు అని మీకు తెలుసా? మూడేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమా ‘డీజే టిల్లు’. నిజానికి ఈ సినిమా ప్రచార చిత్రాల వచ్చేంతవరకే ఆ సినిమా అంచనాలు లేకుండా ఉంది అని చెప్పాలి. హీరో పాత్ర చిత్రణ, నేహా శెట్టి (Neha Shetty) గ్లామర్ ఇలా చాలా విషయాలు సినిమా మీద ఆసక్తిని పెంచాయి.
ఆ విషయం పక్కనపెడితే సినిమా పేరే ఇప్పుడు టాపిక్. మీకు గుర్తుండే ఉంటుంది. ‘డీజే టిల్లు’ సినిమాకు తొలుత అనుకున్న పేరు ‘నరుడి బతుకు నటన’. అవును నిజమే. సినిమా షూటింగ్ చివరి వరకు ఈ టైటిల్‌తోనే నడిచింది. అయితే సినిమా గురించి స్నేహితులతో డిస్కస్ చేస్తున్నప్పుడు సినిమా పేరు చెప్పగానే ఇదేదో ఓ సాధారణమైన సినిమా పేరులా ఉంది అనేవారట. అలాగే ఓసారి త్రివిక్రమ్ (Trivikram) (సినిమా నిర్మాణంలో భాగ) ఓసారి టైటిల్ విని ఇదొక మధ్యతరగతి వ్యక్తి, కుటుంబం కథ అనుకున్నారట.
దాంతో టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నామని హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపాడు. దాంతో సినిమాలోని హీరో పాత్ర పేరు డీజే టిల్లునే సినిమా టైటిల్‌గా పెడితే బాగుంటుందని నిర్ణయించుకుని పేరు మార్చుకున్నారట. అయితే ఈ మార్పు వల్ల సినిమా నిర్మాతకు రూ. 4 లక్షలు లాస్ అయిందట. ఎందుకంటే సినిమా టైటిల్‌ను మాకంటే ముందు వేరే వాళ్లు రిజిస్టర్ చేయించుకుంటే..
వాళ్లకు సుమారు రూ.4 లక్షలు ఇచ్చి మరీ కొనుగోలు చేశారట. కానీ పేరు మార్చేయడంతో ఆ డబ్బులు కూడా పోయాయట. అయితే ఆ పేరుతో గతేడాది ఓ చిన్న సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రస్తుత సినిమాల సంగతి చూస్తే.. ‘జాక్’(Jack), ‘తెలుసు కదా’ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.