తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాతో ఏ డైరెక్టర్ అయినా వరుస విజయాలను సొంతం చేసుకోవడం సులువు కాదనే సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ మాత్రం మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆచార్య మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ట్రైలర్ లోనే ఈ సినిమా కథను దాదాపుగా రివీల్ చేశారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ ప్రేక్షకులు ఊహించుకుంటున్న కథ వేరని ఆచార్య అసలు కథ వేరని చెబుతున్నారు. ఆచార్య కథ రాయాలని అనుకున్న సమయంలో అసలు చరణ్ పాత్ర లేదని సినిమాలో చరణ్ గురుకులం విద్యార్థిగా పూజా హెగ్డే బ్రాహ్మిణ్ అమ్మాయిగా కనిపిస్తుందని కొరటాల శివ కామెంట్లు చేశారు. ట్రైలర్ లో చూపించింది ఆచార్య మూవీ నేపథ్యం మాత్రమేనని కొరటాల శివ తెలిపారు. ఆచార్య మూవీ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉండనుందని బోగట్టా.
కథ, కథనం గురించి లీక్ కాకుండా కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకులు ఊహించే కథ ఆచార్యలో ఉండదని కొరటాల శివ చెప్పడంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. మిర్చి తర్వాత ఆ స్థాయిలో హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ చేయలేదని ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమా తెలుగు సినిమా పరిధులు దాటే విధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రభాస్ తో మరో సినిమా చేయాలని తనకు కూడా ఉందని కచ్చితంగా సినిమా ఉంటుందని ఇద్దరం నిత్యం టచ్ లో ఉంటామని ఆయన తెలిపారు.
సినిమా రంగంలో కామెంట్లు, గాసిప్స్ తప్పవని అర్థమైందని నేను సెన్సిటివ్ కావడం వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని కొరటాల శివ పేర్కొన్నారు. పవన్ కోసం మంచి కథ సిద్ధం చేశానని ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో సైలంట్ అయిపోయానని కొరటాల శివ చెప్పుకొచ్చారు.