Balakrishna: అఖండకు బాలయ్య కొత్త మూవీకి లింక్ ఇదే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవునిపై భక్తి ఎక్కువగా ఉన్న హీరోలలో బాలకృష్ణ ఒకరు. ముహూర్తాలకు బాలయ్య ఎంతో ప్రాధాన్యత ఇస్తారని జాతకాలను విశ్వసిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో కూడా బాలకృష్ణ ఈ సెంటిమెంట్లను ఫాలో అవుతారని సమాచారం. అఖండ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో నటించగా ఈ సినిమాలో భక్తికి, దేవుళ్లకు ప్రాధన్యత ఉందనే సంగతి తెలిసిందే. ఈ సన్నివేశాల వల్లే అఖండ సినిమా అంచనాలకు మించి హిట్ అయిందని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తారు.

బాలయ్య కొత్త మూవీ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అన్నగారు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఈ సినిమాకు దాదాపుగా ఇదే టైటిల్ ఫిక్స్ కానుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. అయితే ఈ సినిమాలో కూడా డివోషనల్ టచ్ ఉంటుందని బోగట్టా. బాలయ్య సూచనల మేరకు దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాలో ఈ సన్నివేశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తుండగా ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఉన్న డైలాగ్స్ కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో రాయలసీమ ఫ్యాక్షన్ తో పాటు మైనింగ్ కు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారని బోగట్టా. మైత్రీ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శృతి రోల్ వెరైటీగా ఉంటుందని సమాచారం అందుతోంది.

బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ సెప్టెంబర్ నెల నుంచి మొదలుకానుంది. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా బాలయ్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.