పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ తదిపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక తాజాగా ప్రభాస్ తన 44వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఎంతోమంది సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
అభిమానుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ ఎంత ఇష్టంగా ఆహారం తీసుకుంటారో మనకు తెలిసిందే. ఇలా ఈయన చాలా ఇష్టంగా ఫుడ్ తీసుకోవడమే కాకుండా అదే విధంగా అందరికీ కూడా ఫుడ్ పెడుతూ ఉంటారు.
ప్రభాస్ సినిమా షూటింగ్ లొకేషన్లో ఉన్నారంటే అక్కడికి ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ వస్తాయని ఇదివరకు ఎంతోమంది ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి తెలియజేశారు. ప్రభాస్ కి నాన్ వెజ్ అంటే కూడా చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. ప్రతిరోజు ఈయన ఆహారంలో భాగంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. పుట్టినరోజు మాత్రం ప్రభాస్ చాలా పట్టింపుగా ఉంటారట. ప్రభాస్ పుట్టినరోజు ఎవరు ఎంత చెప్పినా ఈయన నాన్ వెజ్ మాత్రం తినరట.
ఆరోజు మొత్తం (Prabhas) ప్రభాస్ పూర్తి శాకాహారం తీసుకుంటారని తెలుస్తుంది. అలాగే పుట్టినరోజు సందర్భంగా లక్షల్లో ఖర్చు చేసే సెలబ్రేట్ చేసుకోవడం ఈయనకు ఇష్టముండదని,ఆ ఖర్చుతో ఆకలితో ఉన్న నలుగురికి అన్నదానం చేసి వారి ఆకలి తీరుస్తానని తెలుస్తుంది. ఏది ఏమైనా పుట్టినరోజున ప్రభాస్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు చాలా సరైనవేనని ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.