కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఇండస్ట్రీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సంవత్సరంన్నర నుంచి ఇండస్ట్రీ పరిస్థితి డైలమాలోనే ఉంది. థియేటర్లు తెరిచినా ఇప్పటికిప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం చిన్న సినిమాలు రిలీజవుతున్నా పెద్ద సినిమాలు రిలీజ్ కావడానికి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి మాత్రం అక్టోబర్ 13వ తేదీనే ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
షూటింగ్ ను పూర్తి చేసుకున్న సినిమాలను రిలీజ్ కావడానికి మేకర్స్ కు ధైర్యం సరిపోకపోతే రాజమౌళి మాత్రం ఇంత కాన్ఫిడెన్స్ తో ప్రమోషన్స్ చేయడానికి అసలు కారణం వేరే ఉందని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొని ఉండటంతో ఏపీలో టికెట్ రేట్లు ఎలా ఉన్నా సినిమాపై ఆ ప్రభావం పెద్దగా పడే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో కరోనా కేసులు పెరిగినా థియేటర్లలో రిలీజైన కొన్ని వారాలకే ఓటీటీలో రిలీజ్ అయ్యేలా జక్కన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పరిస్థితులు పూర్తిగా అనుకూలించకపోతే మాత్రం రాజమౌళి మరోసారి రిలీజ్ డేట్ వాయిదాకే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే మాత్రమే ఈ సినిమాకు భారీగా లాభాలు వస్తాయి. ఆర్ఆర్ఆర్ కు కళ్లు చెదిరే లాభాలు రావాలంటే మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. జక్కన్న చెప్పిన డేట్ కే విజువల్ ట్రీట్ ఉండనుందో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.