మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా.. సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇది చరణ్ 15వ సినిమా కాగా దిల్ రాజుకి 50వ సినిమా.. హెవీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో.. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఖర్చు పెరుగుతున్నా ఏమాత్రం వెనుకాడకుండా తెరకెక్కిస్తున్నారు.ఫైట్స్, సాంగ్స్, వాటి సెట్స్ కోసం కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారట.
ఇప్పటికే డిజిటల్, డబ్బింగ్ రైట్స్ ద్వారానే పెట్టుబడి వచ్చేసిందని కూడా అంటున్నారు. ఇప్పటికే కొంత భాగం విదేశాల్లో షూట్ చేశారు. ఈమధ్యే హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనూ చిత్రీకరణ జరిపారు. శంకర్ శిష్యుడు, కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథ, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. శ్రీకాంత్, సునీల్. ఎస్.జె. సూర్య, సముద్రఖని, నాజర్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని,
పెద్ద చరణ్ భార్యగా అంజలి కనిపించనుందని కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. అది నిజమేనని తెలుస్తోంది. అలాగే తండ్రి క్యారెక్టర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.. పెద్ద రామ్ చరణ్ క్యారెక్టర్ పొలిటిషియన్.. ఆయన పార్టీ పేరు ‘అభ్యుదయం పార్టీ’.. ఆయన ఎన్నికల గుర్తు ట్రాక్టర్ గుర్తు అని సమాచారం. దేశ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొచ్చే రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించే క్యారెక్టర్ సినిమాకే హైలెట్ అవుతుందని..
ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి చరణ్ కనిపిస్తాడని.. అలాగే చిన్న రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గానూ.. కియారా ఆయనకు జోడీగానూ కనిపిస్తారట.. తండ్రీ కొడుకుల పాత్రలకు ఊహించని లింక్ కూడా ఉంటుందని.. చరణ్ కెరీర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరో పాన్ ఇండియా హిట్ ఫిల్మ్ అవుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. 2024 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.