టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న RC16 (RC16 Movie) ప్రాజెక్ట్‌కి ఎ.ఆర్. రెహమాన్‌ను (A.R.Rahman) సంగీత దర్శకుడిగా తీసుకోవడం, ఆ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న రెహమాన్ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చిందని కూడా చెప్పాడు. రెహమాన్ లాంచింగ్ వంటి కార్యక్రమాలలో హాజరుకావడం అరుదుగా కనిపించే సంఘటన. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి రెహమాన్ వైదొలగినట్లు వార్తలు వినిపిస్తుండటం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని రేపుతోంది. ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే రెహమాన్ కొన్ని ట్యూన్స్ ఇచ్చారని మేకర్స్ వెల్లడించారు.
RC16
రెహమాన్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించిన దర్శకుడు, తన కథకు అనుగుణంగా అత్యుత్తమ సంగీతాన్ని అందించగలరు అనే నమ్మకంతో ఆయనను తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల రెహమాన్ ప్రాజెక్ట్ వదిలేశారనే ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే, రెహమాన్ స్థానాన్ని దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) వంటి మ్యూజిక్ డైరెక్టర్ భర్తీ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇండస్ట్రీలో రెహమాన్ పని పద్ధతుల గురించి కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ‘‘ఆన్ టైమ్‌గా స్పీడ్ గా ట్యూన్స్ ఇవ్వరు, సినిమాల విడుదల ఆలస్యానికి కారణమవుతారు’’ అనే వ్యాఖ్యలు గతంలో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) వంటి ప్రముఖుల నుంచి వచ్చాయి.
కానీ బెస్ట్ మ్యూజిక్ ఇస్తారనే మంచి అభిప్రాయం కూడా ఉంది. దీనికి తోడు, ఆయన ప్రాజెక్ట్‌లను మధ్యలో వదిలిపెట్టిన అనుభవాలు కొన్ని ఉండటం, తాజా పరిస్థితికి మరింత బలం చేకూరుస్తోంది. కానీ ఇది నిజమా? లేక కేవలం పుకార్లా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రెహమాన్ వంటి లెజెండరీ సంగీత దర్శకుడు ప్రాజెక్ట్‌కి పని చేస్తే, సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. దీంతోపాటు రెహమాన్ ప్రత్యేకమైన టచ్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లగలదు.
కానీ తాజా పరిణామాలతో, ప్రాజెక్ట్ టీమ్ కొత్త దిశగా ఆలోచిస్తోందా? లేక రెహమాన్ ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. ప్రాజెక్ట్ ప్రారంభ దశలో రెహమాన్ పాల్గొనడం, మేకర్స్ అంచనాలు పెంచినప్పటికీ, ఈ వార్తలు అభిమానులకు నిరాశ కలిగించవచ్చు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు ఎదురుచూడాల్సిందే.