‘ప్రజా రాజ్యమే జనసేన.. ఆ పార్టీనే ఇలా రూపాంతరం’ చెందింది. ఈ కామెంట్ మీరు ఇప్పటికే వినే ఉంటారు. ‘లైలా’ (Laila) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి (Chiranjeevi) మాటలు మాట్లాడారు. ఎందుకు ఈ టాపిక్ వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది చిరంజీవికి మాత్రమే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ‘ప్రజారాజ్యం’ పార్టీ లేదు. ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ రూపాంతరం చెంది జనసేన అవుతుంది.
‘లైలా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగి రెండ్రోజులు అవుతున్నా.. ఇటు సినిమా పరిశ్రమలో, అటు రాజకీయాల్లో ఈ విషయం గురించే చర్చ జరుగుతోంది. ఏదో మాట్లాడబోతూ చిరంజీవి ప్రజారాజ్యం గురించి ప్రస్తావనకు తెచ్చారు చిరంజీవి. ఆ వెంటనే ఎవరూ ఏమీ అనకుండానే ‘ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం’ చెందింది.. ‘జై జనసేన’ అని నినాదం ఎత్తుకున్నారు. దీంతోనే చర్చ మళ్లీ మొదలైంది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి చిరంజీవి ఎక్కడా యాక్టివ్‌గా లేరు. సినిమాల్లోకి మళ్లీ వచ్చేశా అని మాత్రమే చెబుతూ వచ్చారు. అయితే పవన్ కల్యాణ్‌కు తన సపోర్టు ఇస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు పార్టీకి, కూటమికి ఓటేయండి అని కూడా పిలుపునిచ్చారు. సుమారుగా 10 ఏళ్లలో ఎక్కడా ‘ప్రజారాజ్యం, జనసేన ఒక్కటే’ అని ఎక్కడా అనలేదు. కానీ ‘లైలా’ ఈవెంట్‌లో అన్నారు.
ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చిరు ఇలా అన్నట్లు, మాట ఎందుకు మారింది. ఈ మాట జనసేనక లాభమా? నష్టమా అంటే కచ్చితంగా లాభమే అని చెప్పొచ్చు. ఎందుకంటే తమ్ముడికి అన్న సపోర్టు ఉండాలి. అయితే లాజికల్‌గా ప్రజారాజ్యం.. జనసేన ఒకటి అవ్వవు. అయితే సిద్ధాంతాలు, ఆలోచనల పరంగా రెండూ ఒకటి కావొచ్చు. ఈ మాట విషయంలో డౌట్ పడేవాళ్లకు ఒక విషయం గుర్తుంచుకోవాలి. పవన్ రీసెంట్‌గా ఎన్నికల ఫలితాల తర్వాత చిరు ఇంటికి పవన్ వచ్చి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు.