విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) – గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తొలినాళ్లలో కాస్త హైప్ కనిపించినా ఆ తర్వాత మళ్లీ వినిపించలేదు. సినిమా రెండు భాగాలు వస్తుంది అని రూమర్లు వస్తున్నా సినిమా గురించి పెద్దగా హైప్ రావడం లేదు. ఇదిగో, అదిగో అంటూ టైటిల్ గురించి చిన్నపాటి లీక్‌లు ఇస్తున్నా హైప్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) భారీ ప్లానే వేశారు.
విజయ్ దేవరకొండ 12వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నారు. సినిమాకు ఓ లెవల్‌లో హైప్ ఇచ్చేందుకు సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్లాన్ చేస్తోంది. సినిమాను మూడు భాషల్లో పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అందుకే ఆ మూడు భాషల నుండి స్టార్ హీరోలను తీసుకొచ్చి టీజర్ కోసం వాయిస్ ఇప్పించారట.
మాఫియా కింగ్ డమ్ బ్యాక్ డ్రాప్‌లో విజయ్ – గౌతమ్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, టీజర్‌ను ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం తెలుగు నుండి ఎన్టీఆర్ (Jr NTR) , తమిళం నుండి సూర్య (Suriya), హిందీ నుండి రణ్‌బీర్ కపూర్‌ను (Ranbir Kapoor) తీసుకొస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు నాగవంశీ, అటు విజయ్ టీజర్‌లు రిలీజ్ చేస్తున్నారు. ఎమోజీలతో సమాచారం ఇస్తున్నారు.
తారక్‌ని సూచిస్తూ నాగవంశీ పులి ఎమోజీని ఎక్స్‌లో పోస్ట్ చేయగా, సూర్యుడి ఎమోజీతో విజయ్ రెండో హీరో పేరు లీక్ చేశారు. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్‌ను ఎలా టీజ్ చేస్తారు అనేది చూడాలి. టీజర్‌లో టాప్ హీరోల వాయిస్ ఓవర్‌తో విజయ్ దేవరకొండ పాత్ర ఎలివేషన్ల గురించి వివరిస్తారట. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఆకర్షణగా ఉంటుంది అని చెబుతున్నారు. టీజర్ లాస్ట్‌లో విజయ్ అరుపు, ఫేసియల్ ఎక్స్‌ప్రెషన్స్ వేరే లెవల్‌లో ఉంటాయి అని చెబుతున్నారు.