రానా (Rana Daggubati) హీరోగా సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. 2022 లో వచ్చిన ‘విరాటపర్వం’ (Virata Parvam) తర్వాత రానా హీరోగా ఒక్క సినిమా కూడా రాలేదు. మధ్యలో తేజ (Teja) దర్శకత్వంలో ‘రాక్షస రాజు’ అనే సినిమా అనౌన్స్ చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత ఆ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. అధికారికంగా దీనిపై క్లారిటీ రాకపోయినా…. తర్వాత దాని గురించి చప్పుడు లేకపోవడంతో అది నిజమే అని అంతా ఫిక్స్ అయిపోయారు.
Prasanth Varma, Rana:
ఇక తేజ కూడా తర్వాత తన కొడుకుని హీరోగా పెట్టి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక రానా డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘హిరణ్యకశిప’ నుండి దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) తప్పుకున్న సంగతి తెలిసిందే. అలా అని రానా ఏమి ఖాళీగా లేడు. నిత్యం ఏదో ఒక సినిమాలో చిన్న చిన్న పాత్రలతో పలకరిస్తూనే ఉన్నాడు. నిఖిల్ (Nikhil Siddhartha) ‘స్పై’ (SPY), నవదీప్ (Navdeep ) ‘లవ్ మౌళి’ (Love Mouli) , రజినీకాంత్ (Rajinikanth) ‘వేట్టయన్’ (Vettaiyan) వంటి సినిమాల్లో రానా నటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రానా ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చి చేరనుంది అని ఇన్సైడ్ టాక్. వివరాల్లోకి వెళితే.. ‘హనుమాన్’ (Hanuman) తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన ప్రశాంత్ వర్మ (Prasanth Varma) .. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) తో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. ‘మైత్రి’ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో ప్రశాంత్ వర్మ..
ఈ కథని రానాకి చెప్పి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ.. ‘జై హనుమాన్’ ప్రాజెక్టు ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. తర్వాత వెంటనే బాలయ్య (Nandamuri Balakrishna) కొడుకు మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) సినిమా ఫినిష్ చేయాలి. వాటి తర్వాత రానా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి ‘బ్రహ్మ రాక్షస’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు.