Pushpa Movie: సినిమాకు ఇంకెన్ని ఇబ్బందులు పడతారో?

చెప్పిన సమయానికి పని పూర్తవ్వకపోతే ఎంత కోపం వస్తుంది చెప్పండి. అలాగే చెప్పిన సమయానికి ట్రైలర్‌/ టీజర్‌ విడుదల కాకపోతే ఎంత చిరాకు వస్తుంది. టాలీవుడ్‌లో ఈ రెండో రకం సమస్య ఎక్కువగా వచ్చే ప్రొడక్షన్‌ హౌస్‌లలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఒకటి. ఆ బ్యానర్‌లో సినిమా అంటే… ఆలస్యం పక్కా అని అంటుంటారు నెటిజన్లు. తాజాగా ‘పుష్ప’ ట్రైలర్‌ విషయంలోనూ ఇదే తరహా ఆలస్యం చేశారు. దీంతో మరోసారి విమర్శల బాణం ఎక్కుపెట్టారు నెటిజన్లు.

ఎలాగోలాగా నానా కష్టాలు పడి రాత్రి 9 తర్వాత ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. చెప్పిన సమయానికి రెండు గంటలకుపైగా ఆలస్యమైంది. అయితే అయిపోయిందేదో అయిపోయింది, సినిమా రిలీజ్‌ విషయంలో అయినా ఇలాంటి రిస్క్‌లు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటూ మైత్రీ టీమ్‌ను నెటిజన్లు సూచిస్తున్నారు. సినిమా విడుదలకు గట్టిగా చూస్తే పది రోజులు కూడా లేదు. అయితే సినిమా పనులు ఇంకా పూర్తవ్వలేదని టాక్‌ వినిపిస్తుండటం గమనార్హం. మరోవైపు సుకుమార్‌ టీమ్‌… రాత్రనక పగలనక సినిమా పనుల్లో ఉన్నారట.

ఈ క్రమంలోనే ట్రైలర్‌ కట్‌ విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయట. ఆఖరి నిమిషంలో ట్రైలర్‌ విషయంలో అసంతృప్తి వచ్చి… మళ్లీ కొన్ని సీన్లు మార్చారని సమాచారం. సినిమా విషయంలో ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటే అభిమానులు ఆనందంగా సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తారు. లేదంటే విమర్శలు తప్పవు అంటున్నారు పరిశీలకులు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.