‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పుడు అభిమానులు ఎంత ఆనందించారో అందరికీ తెలిసిందే. అదే సమయంలో బోనీ కపూర్ పడ్డ బాధ కూడా అంతే తెలుసు. రాజమౌళిని తిట్టేంత పని చేశారు బోనీ కపూర్. తన సినిమా ‘మైదాన్’ రిలీజ్ డేట్‌కి దగ్గరగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల చేయాలని జక్కన్న టీమ్ నిర్ణయించడమే. దీంతో బోనీ కపూర్ రెండు, మూడు సార్లు ఘాటుగానే విమర్శించాడు. అయితే బోనీ కపూర్ ఇప్పుడు కూల్ అవ్వొచ్చేమో. ఎందుకంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ డేట్ వాయిదా పడుతుందని వార్తలొస్తున్నాయిగా!
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రీకరణ ఇంకా కొంత బ్యాలన్స్ ఉంది. ఈ లోగా ఆలియా భట్ కరోనా బారిన పడింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మందకొడిగా సాగుతున్నాయని టాక్. దీంతో సినిమా అక్టోబరు నాటికి కష్టం అని అంటున్నారు. దీంతో సినిమా విడుదల వాయిదా వేయడం పక్కా అని వార్తలొస్తున్నాయి. దీంతో అక్టోబర్ 15న ‘మైదాన్’ విడుదల చేద్దాం అనుకున్న బోనీ కపూర్‌కి లైన్ క్లియర్ అయినట్లే. ఈ క్రమంలో బోనీ.. రాజమౌళి టీమ్ థ్యాంక్స్ చెబుతాడేమో అంటూ జోకులు పేలుతున్నాయి.
ఇక్కడే మరో విషయం గమనించాల్సి ఉంది. అసలు అక్టోబరు 15న ‘మైదాన్’ విడుదల చేసే పరిస్థితి బాలీవుడ్‌లో ఉందా? ఎందుకంటే ముంబయిలో కేసులు సంఖ్య పెరుగుతోంది. దీంతో పెద్ద సినిమాలు వాయిదాలు వేస్తున్నారు. మొన్నే ‘సూర్యవంశీ’ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొవిడ్ రెండో షో గట్టిగానే కొడుతున్న సమయంలో ‘మైదాన్’ విడుదల చేయగలుగుతారా? అనేది చూడాలి. బోనీ సాబ్.. ఏదో కొటి చెప్పేద్దురు.