‘పుష్ప’ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ ‘ఉ అంటావా… ఊఊ అంటావా..’ పాట వచ్చింద చూశారు కదా! ఛ మా చాదస్తం కాకపోతే అంతటి హాట్ ఐటెమ్‌ను చూశారా అని అడగం ఏంటి, ఎన్నిసార్లు చూశారు అని అడగాలి. ఇక విషయానికొస్తే… ఆ పాట లిరిక్స్ విన్నారా… భలే ఉన్నాయి కదా. మగ బుద్ధి గురించి భలే మత్తుగా, గమ్మత్తుగా వినిపించారు. దీనిపై ఇప్పటికే కొంతమంది మనోభావాలు దెబ్బతిని ఫిర్యాదులు కూడా చేశారు.
అయితే ఈ పాటలో ఉన్న లిరిక్స్ వెనుక మరో అర్థం దాగుందా? సోషల్ మీడియాలో ఇప్పుడు దీని మీదే చర్చ జరుగుతోంది. సమంత నిజ జీవితంలో కొన్ని సిట్యువేషన్స్‌కి రిలేట్ చేసి ఈ పాట రాసినట్లుంది అని అంటున్నారు నెటిజన్లు. ఈ పాట లిరిక్స్ గమనిస్తే.. మగాళ్ల వంకర బుద్ధులు గురించి వివరించారు. అమ్మాయిల విషయంలో వారి ఆలోచన తీరు ఎలాంటి ఉంటుందో సెటైరికల్‌గా, ఫిలాసిఫకల్‌గా చెప్పుకొచ్చారు. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత కాస్త అప్‌సెట్ అయ్యింది.
కొంత వైరాగ్యంలోకి కూడా వెళ్లిపోయింది అనిపించింది. ‘అమ్మ చెప్పింది’ పేరుతో సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టింది. అందులో మహిళల పరిస్థితులు, మగవాళ్ల ఆలోచనలను చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ‘పుష్ప’ ఐటెమ్ సాంగ్‌లో కూడా ఇలాంటి పదాలు, అర్థాలే కనిపించాయి. దీంతో ఈ పాట అంతా స్ట్రాటజీ ప్రకారమే జరిగింది అనుకోవచ్చా? అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.