సూర్య (Suriya) ఎలాంటి సినిమా చేసినా అందులో కొత్తదనం చూపించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇటీవల కాలంలో ఆయన సినిమాల ఎంపిక చూస్తేనే మనకు ఈ విషయం తెలిసిపోతుంది. అలాంటి సూర్య మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శివతో (Siva) ఓ సినిమా ఓకే చేశాడు అనేసరికి ‘అదేంటి సూర్య మళ్లీ పాత రూట్‌లోకి వచ్చేస్తున్నాడా?’ అనే డౌట్ కలిగింది ఫ్యాన్స్‌కి. అయితే సినిమా కాన్సెప్ట్ గురించి తెలిసేసరికి కొత్త శివను చూస్తాం అని ఆనందించారు. ఆ సినిమానే ‘కంగువ’ (Kanguva) .
తమిళ నూతన సంవత్సరం సందర్భంగా సినిమా టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ చూశాక అభిమానులు, నెటిజన్లు సినిమా కథ ఇలా ఉండొచ్చు అంటూ ఓ లెక్క వేసేస్తున్నారు. కత్తి పట్టిన యుద్ధ వీరుడు ఒకవైపు.. మోడరన్ వారియర్‌గా మరోవైపు సూర్య కనిపించిన పోస్టర్ ఇది. గతం, వర్తమానం ఢీకొంటే కొత్త భవిష్యత్ మొదలవుతుంది అనే ఆ పోస్టర్‌తో క్యాప్షన్ రాసింది సినిమా టీమ్. దీంతో ఈ సినిమా టైం ట్రావెల్ కథే అంటూ అంచనాకు వచ్చేస్తున్నారు ఫ్యాన్స్.
పాస్ట్, ప్రజెంట్‌ను ఎలా కలుపుతారు అంటూ ఆసక్తిగా అంచనాలు వేస్తున్నారు. భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అని ఇన్నాళ్లూ అనుకుంటుంటే… ఇప్పుడు టైమ్ ట్రావెల్ అని చెప్పి కథ ఆలోచనలో ఇంకాస్త మసాలా యాడ్ చేశారు. కొందరేమో ఈ సినిమా కల్యాణ్ రామ్ (Kalyan Ram) ‘బింబిసార’లా (Bimbisara) ఉంటుంది అని అంటుంటే.. మరికొందరేమో ప్రభాస్ (Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) లా ఉంది అంటున్నారు.
ఈ విషయంలో టీమ్ నుండి క్లారిటీ వస్తుందో లేక ‘అంతా థియేటర్‌లోనే’ అంటారేమో చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్‌గా దిశా పటానీ (Disha Patani) నటిస్తుండగా… బాబీ డియోల్ (Bobby De0l) కీలక కనిపించబోతున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మొత్తంగా పది భాషల్లో రానున్న ఈ సినిమాను ఈ ఏడాదే తీసుకొస్తామని టీమ్ చెబుతోంది. అయితే రిలీజ్ డేట్ చెప్పలేదు.