‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) సక్సెస్ ముగ్గురికి చాలా కీలకంగా మారింది. హీరో రామ్ (Ram) , దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) , హీరోయిన్ కావ్య థాపర్ (Kavya Thapar) . దర్శకుడు పూరీ విషయానికి వస్తే… ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) తర్వాత ఆయన తెరకెక్కించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ (Liger) పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాకు పూరీ ఓ నిర్మాత కూడా..! కాబట్టి డిస్ట్రిబ్యూటర్ల నుండి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది.కాబట్టి ఈ సినిమా హిట్ అయ్యి డబ్బులు వస్తే తప్ప.. ఆయనకు రిలీఫ్ దక్కదు.
అలాగే హీరో రామ్ కూడా ‘ది వారియర్’ (The Warriorr) ‘స్కంద’ (Skanda) వంటి డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. ‘రెడ్’ (RED) కొంత పర్వాలేదు అనిపించినా అది ‘ఇస్మార్ట్ శంకర్’ రేంజ్ హిట్టు కాదు. ఇక హీరోయిన్ కావ్యా థాపర్ కూడా చాలా కాలంగా ఓ హిట్టు కోసం ఎదురుచూస్తుంది. ఇలా ఈ ముగ్గురూ ‘డబుల్ ఇస్మార్ట్’ పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరోపక్క.. ఇటీవల రిలీజ్ అయిన ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ మాస్ జనాలని ఆకట్టుకుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తో పోలిస్తే ఇందులో మరింత ఎమోషన్స్ ఉన్నాయనే క్లారిటీ ఇచ్చింది ట్రైలర్.
ఈ సినిమా కథ కూడా ఓ రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిందట. ఢిల్లీలోని ‘ఓ వ్యాపారవేత్త తన మెమొరీ తన వారసులకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మరొకరి మెదడులోకి తన మైండ్లో ఉన్న డేటా పంపాలి అనుకుంటాడు. తనకు తెలిసిన సైంటిస్ట్ లు, డాక్టర్లతో దీనిపై రీసెర్చ్ చేయించాడు. కానీ అతని ప్రయోగం సక్సెస్ కాలేదు.
అదే ప్రయోగం సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ తో పూరీ ‘డబుల్ ఇస్మార్ట్’ ని రూపొందించాడట. ముంబైకి చెందిన వ్యాపారవేత్తగా ఇందులో సంజయ్ దత్ (Sanjay Dutt) .. కనిపిస్తున్నాడు. అతని మెమొరీ హీరోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. స్క్రీన్ ప్లే బాగుంటే..ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి.