దేశంలో అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న సినీ కథా రచయిత అని ఆయనకు పేరు. ఎన్నో భారీ బ్లాక్‌బస్టర్‌లు ఆయన ఖాతాలో పడుతూనే ఉన్నాయి. ఆయనే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. ఆయకు ఆనందం కలిగించేలా చెప్పాలంటే రాజమౌళి తండ్రి. అంత గొప్ప రచయిత.. సినిమా కథలు రాయరా… అసలు ఆయన రైటర్ కారా? ఇదే మాట ఆయన దగ్గర అంటే… భలే సమాధానమిచ్చారు. ముందుగా చెప్పుకున్నట్లు ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్…
తన సినిమా కథలు రాయరట. అన్నీ తన మైండ్‌లోనే ఉంటాయట. ఏదైనా కథను దర్శకుడు ఓకే చేస్తే… అప్పుడు నెరేట్ చేస్తారట. అది విని అతని బృందం కథను రాసి ఇస్తుందట. ఈ మాట మేం అనలేదు. ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు టైటిల్స్‌లో తన పేరు ముందు రైటర్ అని కాకుండా.. నెరేటర్ అని పెడితే బాగుంటుందని జోకేశారు కూడా. ఇక భారీ కాన్వాస్‌తో కథలు రాసే ఆయనకు స్ఫూర్తి ఎక్కడి నుండి వస్తుందనే ప్రశ్న కూడా మన మెదళ్లను తొలుస్తూ ఉంటుంది.
దానికి ఆయన చెప్పిన సమాధానం ‘చందమామ’. ఇప్పటితరానికి తక్కువగా, మన ముందు తరానికి బాగా తెలిసిన కథల పుస్తకం ‘చందమామ’అట. అందులో కథల స్ఫూర్తితోనే విజయేంద్ర ప్రసాద్ కథలు రాసుకుంటూ ఉంటారట. అందులో అంత గొప్పగా ఉంటాయి మరి.