‘వార్ 2’ (War 2) సినిమా నుండి ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ టీజర్ వచ్చింది చూశారా? ఈ మాట ఎవరైనా అంటే ఠక్కున వస్తున్న రిప్లై.. ‘అది ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ టీజరా?’ అని. ఎందుకంటే ఆ వీడియో చూసిన ఎవరికైనా సరే ఇదే డౌట్ వస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ కూడా ఇదే మాట అంటుండడం గమనార్హం. దీనికి కారణం ఆ టీజర్‌లో హైలైట్ అయిన అంశాలు ఏవీ ఎన్టీఆర్‌కు దగ్గరగా లేకపోవడమే. ఇంకా చూసుకుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా చేసేవే ఎక్కువ ఉన్నాయి.
టీజర్లో ఏమన్నా ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్‌కి ఆసక్తికరంగా అనిపించేది ఉందా అంటే.. అది తారక్ వాయిస్ మాత్రమే. ఆ వాయిస్‌ని వింటుంటే ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ వస్తుంటాయి. అయితే ఈసారి ఆయన వాయిస్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) పాత్రను ఎలివేట్ చేయడానికి వాడుకోవడం నిరాశ కలిగించే విషయం. ఈ గోరు చుట్టుకు రోకలిపోటులా స్క్రీన్ ప్రజెన్స్ విషయంలో హృతిక్‌తో పోలిస్తే తారక్‌కు తక్కువగా ఉంది అని చెప్పాలి. కనిపించిన కాసేపు కూడా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నాసి రకంగా ఉండటంతో సరిగ్గా ప్రజెన్స్ అవ్వలేదు.
టీజర్ అంతా ఓ లెవల్‌లో వెళ్తుంటే మధ్యలో టూ పీస్ బికినీతో కియారా అద్వానీని (Kiara Advani) ప్రవేశపెట్టి మొత్తం కళ్లను అటువైపు తిప్పేశారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. కొంతమంది ఆ సీన్ కోసం టీజర్‌ను బ్యాక్ చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. దీంతో ఎన్టీఆర్ లుక్, ఫీల్ అన్నీ పోతున్నాయి అని అంటున్నారు. ఈ సినిమాలో హృతిక్‌కి సరిసమానమైన పాత్ర కోసం తారక్‌ను తీసుకున్నారు అని గత కొన్ని రోజులుగా తెలుగు మీడియాలో చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అలా కనిపించడం లేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీంతో అసలు ఈ టీజర్ ఎన్టీఆర్ స్పెషలా? లేక రెగ్యులర్ టీజర్‌ను ఈ డేట్ పెట్టి హైప్ చేసి వదిలారా అనే డౌట్ వస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అయితే ‘విశ్వంభర’(Vishwambhara) , ‘ఆదపురుష్’ (Adipurush) సినిమాల గ్లింప్స్, టీజర్‌లకు వచ్చినంత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మరి బాలీవుడ్ బాబులు వింటారో లేదో చూడాలి. అన్నట్లు బీ టౌన్ ఫ్యాన్స్ అయితే భలే హ్యాపీగా ఉన్నారు. హృతిక్‌ని బాగా చూపించారు కదా ఆ మాత్రం ఉంటుంది.