బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి అతిపెద్ద కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమంలో ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమై ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్స్ గా కొనసాగుతున్నటువంటి వారిలో రాజమౌళి ఒకరు. కామెడీ స్కిట్స్ లో తను తాగుబోతుగా ఎక్కువ ఎపిసోడ్స్ చేశాడు. అలాగే అమాయకమైన పాత్రలలోను నటించి సందడి చేశారు. ఇక ఈయన సింగర్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు పాటలను కూడా ఎంతో అద్భుతంగా పాడుతారనే సంగతి తెలిసిందే.
తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చి నఇంటర్వూలో మాట్లాడుతూ.. మాది చాలా మారుమూల పల్లెటూరు .. అందువలన చిన్నప్పటి నుంచి తాగుబోతులను చాలా దగ్గరగా చూశాను అందుకే అలాంటి పాత్రలలో చాలా సులభంగా నటించాలని తెలిపారు. ఇక మా నాన్న కూడా నటుడేనని ఈయన వెల్లడించారు నాన్న ఎన్నో డ్రామాలు నాటకాలు వేసేవారని అందుకే నటనపై నాకు కూడా ఆసక్తి పెరిగింది అంటూ ఈయన వెల్లడించారు.
కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తాజాగా ఈయన తెలిపారు. తాను కూడా కరోనా బారిన పడ్డానని చాలా సీరియస్ అవ్వడంతో నన్ను హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాటం చేశాను. చికిత్స కోసం చాలా డబ్బులు కూడా ఖర్చు చేశాను. అయినప్పటికీ నేను బ్రతకనని అందరూ అనుకున్నారు. అయితే నేను చచ్చి బ్రతికానని ఈ సందర్భంగా రాజమౌళి (Comedian Rajamouli) చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.