Faima: తన కలర్ గురించి విమర్శించే వారిపై ఫైమా స్పందన
- October 27, 2023 / 02:20 PM ISTByFilmy Focus
ఫైమా షేక్ అలియాస్ ‘జబర్దస్త్’ గురించి తెలియని వారంటూ ఉండరేమో అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. ‘పటాస్’ షోలో ఓ స్టూడెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె యాంకర్ రవి ఎంకరేజ్మెంట్ తో అందులో యాంకర్ గా కూడా చేసే అవకాశాన్ని పొందింది. అప్పటి నుండి ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అటు తర్వాత ‘పోవే పోరా’ ‘జబర్దస్త్’ వంటి షోలు ఈమె కెరీర్ ను మార్చేశాయి అని చెప్పాలి.
ఇక బిగ్ బాస్ 6లో కూడా ఎంట్రీ ఇచ్చి.. ఈమె మరింతగా పాపులర్ అయ్యింది అని చెప్పాలి. తర్వాత బుల్లితెరపై ప్రసారమవుతున్న అనేక షోలలో ఈమె కనిపిస్తుంది. అలాగే పలు సినిమాల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ‘తెలుగు మీడియం హైస్కూల్’ అనే మూవీ షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఓ మీడియాతో ముచ్చటించిన ఫైమా.. కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసి మళ్ళీ వార్తల్లో నిలిచింది అని చెప్పాలి.

విషయంలోకి వెళితే.. (Faima) ఫైమా కొంచెం రంగు తక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కారణంతో ఆమెను విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని ఆమె బాధపడింది. ఆమె మాట్లాడుతూ.. “ఇప్పటికీ నా కలర్ గురించి మాటలు అనే వాళ్ళు ఎక్కువమందే ఉన్నారు. కానీ, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే.. అప్పుడు నేను పట్టించుకుని బాధపడేదాన్ని. ఇప్పుడైతే పట్టించుకోవడం మానేశాను. మార్పు అనేది మన నుండే మొదలవ్వాలి అని నేను నమ్ముతాను. ఎవ్వరూ మనకు సాయం చేయడానికి రారు.

మనం పడిపోతే నవ్వే వాళ్ళు తప్ప.. చెయ్యి ఇచ్చి పైకి లేపే వాళ్ళు ఉండరు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం డిసైడ్ అవ్వాలి.. ఎవ్వరి మాటా వినకూడదు అని.! గతంలో నేను ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులకు భయపడి నేను ఆగిపోయి ఉంటే..ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండేదాన్ని కాదు. అవన్నీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చాను కాబట్టే.. ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది ఫైమా.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














