Tiger Shroff, Disha Patani: హీరో ప్రేమాయణంపై తండ్రి క్లారిటీ!

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్ లో ఉన్నట్లు చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పార్టీలకు, పబ్ లకు వెళ్తూ చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. బాలీవుడ్ లో వీరి డేటింగ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ జంట మాత్రం తమ ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. కానీ తాజాగా తన కుమారుడు టైగర్ ష్రాఫ్ ప్రేమ వ్యవహారంపై నటుడు జాకీ ష్రాఫ్ స్పందించారు.

టైగర్-దిశా మంచి స్నేహితులని ఆయన అన్నారు. సుమారు ఆరేళ్ల నుండి డేటింగ్ లో ఉన్నట్లు చెప్పారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న జాకీ ష్రాఫ్ ను టైగర్ ప్రేమాయణం గురించి ప్రశ్నించారు హోస్ట్. అది టైగర్ వ్యక్తిగత జీవితమని చెప్పిన జాకీ ష్రాఫ్.. తన కొడుకు 25 సంవత్సరాల వయసు నుండే డేటింగ్ చేస్తున్నాడని అన్నారు. టైగర్-దిశా బెస్ట్ ఫ్రెండ్స్ అని.. వారిద్దరి అనుబంధం భవిష్యత్తులో ఎంతవరకు వెళ్తుందనే దానిపై తనకు ఎలాంటి ఆలోచన లేదని అన్నారు.

కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలనని.. ప్రస్తుతం టైగర్ దృష్టి మొత్తం వర్క్ మీదే ఉందని.. ప్రేక్షకులు మెచ్చుకునేలా మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నాడని.. ఈ ప్రాసెస్ లో పేరెంట్స్, సిస్టర్, గర్ల్ ఫ్రెండ్ ఇవేవీ అతడికి మేటర్ కాదని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న టైగర్ సోదరి కృష్ణ కూడా తన అన్నయ్య ఆలోచనలను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటానని తెలిపారు. టైగర్ కి ఆనందనని ఇచ్చేది తమకు కూడా సంతోషాన్ని ఇస్తుందని అన్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Share.