ఈ మధ్య చాలా బ్యాడ్ న్యూస్ లు వినాల్సి వస్తుంది. సినీ పరిశ్రమకు చెందిన ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. నటీనటులు లేదంటే దర్శకులు. వాళ్ళు కాదు అంటే సాంకేతిక నిపుణులు మరణిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో నటి మరణించింది. సర్జరీ వికటించడంతో ఓ ప్రముఖ నటి మరణించినట్టు తెలుస్తుంది. సినీ పరిశ్రమలో హీరోయిన్లు లేదా నటీమణులు ఎవరైనా సరే తమ అందాన్ని కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
అందం చెక్కు చెదిరింది అంటే వారికి అవకాశాలు రావు అనేది వారి భయం. నిజం కూడా అదే..! కాబట్టి.. నటీమణులు తమ అందాన్ని కాపాడుకునేందుకు యోగా వంటి ఎన్నో కసరత్తులు చేస్తూ ఉంటారు. కడుపు కాల్చుకొని మరీ కొంతమంది జిమ్లో వర్కౌట్లు వంటివి కూడా చేస్తూ ఉంటారు. పొరపాటున ఎవరైనా లావుగా అయిపోతే వెంటనే.. సర్జరీల వైపు దృష్టి పెడతారా. ఇదే కొంతమంది హీరోయిన్ల కొంప ముంచుతుంది. సర్జరీ బాగా జరిగితే ఎటువంటి ఇబ్బంది లేదు.
కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం.. వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. గతంలో ఆర్తీ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు ఇలాగే మరణించారు. తాజాగా మరో నటి ఇలాగే సర్జరీ వికటించి చనిపోయింది. అర్జెంటీనా నటి జాక్వెలిన్ క్యారీరీ తాజాగా కాస్మెటిక్ సర్జరీ వికటించడంతో ప్రాణాలు కోల్పోయింది. బ్లడ్ క్లాట్ అయిపోవడంతో ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమె (Jacqueline carrieri ) అక్టోబర్ 1 నే చనిపోగా.. ఆ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !