అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన తొలి తెలుగు చిత్రం దేవర ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జాన్వీ అభిమానులకు ఆమె పాత్ర కొంత నిరుత్సాహాన్ని మిగిల్చింది. తంగ అనే పాత్రలో జాన్వీ అందాన్ని మించిన ప్రాధాన్యత చూపించకపోవడం, పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో ఆమె నటనకు తగిన గుర్తింపు రాలేదు. ఇక దేవర-2లో జాన్వీ పాత్రకు మరింత ప్రాధాన్యత ఉంటుందా, లేదా అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
Buchi Babu
అయితే మొదటి భాగంలో జాన్వీ పాత్రకు తగిన స్కోప్ లేకపోవడంతో దర్శకుడిపై కూడా విమర్శలు వచ్చాయి. ఇక జాన్వీ అభిమానులు నెక్స్ట్ RC16 (RC16 Movie) దర్శకుడు బుచ్చిబాబుపై బలమైన హోప్స్ అయితే పెట్టుకున్నారు. అలాగే సోషల్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నారు. బుచ్చిబాబు (Buchi Babu Sana) రామ్ చరణ్ (Ram Charan) హీరోగా RC 16 అనే మరో ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్వీకపూర్ మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది.
అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటే, తొలి చిత్రంలో ఎదురైన విమర్శలకు సమాధానం ఇవ్వగలరని జాన్వీ అభిమానులు భావిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ కథలో హీరోయిన్ పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినిమాపై మరింత హైప్ తెచ్చింది. బుచ్చిబాబు గత చిత్రం ఉప్పెనలో కృతి శెట్టి (Krithi Shetty) పాత్రకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు.
కథానాయిక పాత్ర సినిమా విజయానికి కీలకంగా నిలిచింది. అలాంటి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, జాన్వీ నటనను కొత్తగా హైలెట చేస్తారా అన్నది చూడాలి. RC 16లో జాన్వీ పాత్రను బలంగా తీర్చి దిద్దితే, టాలీవుడ్‌లో ఆమె స్థానం మరింత బలపడుతుందని స్పష్టమవుతుంది. మరి బుచ్చిబాబు హీరోయిన్ క్యారెక్టర్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.